ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఆసుపత్రులలో అమాయకుల మీద మందుల ప్రయోగం... (Private Hospitals | Medicines | Supreme Court | Government)
ఆసుపత్రులలో అమాయకుల మీద మందుల ప్రయోగం...
సోమవారం, 26 మార్చి 2012( 21:14 IST )
File
FILE
మందుల ప్రభావాన్ని పరిశీలించేందుకు కొన్ని ఆసుపత్రులలో రోగుల మీదా, పిల్లల మీదా వాటిని ప్రయోగిస్తున్నారు. దాని వల్ల అమాయక ప్రజలు బలైపోతున్నారు. చట్ట వ్యతిరేకమైన ఈ చర్యను నివారించాలి, ఈ పరిశోధనలు చేస్తున్న ఆసుపత్రులమీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సుప్రీమ్ కోర్టులో కేసు దాఖలు చేయబడింది. ఆ కేసు ఈ రోజు మళ్ళీ విచారణకు వచ్చింది.
చట్ట వ్యతిరేకమైన ఔషధ పరిశోధనా వ్యవహారం చాలా దురదృష్టకరమైన చర్య అని, అది తమకు చాలా బాధ కలిగిస్తోందని న్యాయాధిపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కలగజేసుకుని పరిశోధన పద్ధతి ప్రకారం జరిగేలా చూడాలని, చట్ట వ్యతిరేకంగా ఔషధ పరిశోధన జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.