జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అగ్ని క్షిపణలు కాదు.. టాయిలెట్లు కావాలి : జైరామ్ రమేష్ (Jairam Ramesh | Agni Missile | Rural Development | Toilets)
jairam ramesh
File
FILE
నిరంతరం వివాదాస్పదాల్లో చిక్కుకున్న కేంద్ర మంత్రి జైరామ్ రమేష్.. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరుగుదొడ్లు లేని దేశంలో అగ్ని క్షిపణులను ప్రయోగించడం వల్ల వచ్చే ఫలితమేమిటని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రిగా విధులు నిర్వహిస్తున్న జైరామ్ రమేష్ పాలకులను ప్రశ్నించారు.

ఒడిషాలోని క్షిపణి ప్రయోగ కేంద్రానికి సమీపంలో గ్రీన్‌ టాయిలెట్స్‌ను ప్రారంభిస్తూ ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. టాయిలెట్ల వ్యవహారంపై ప్రతి రోజూ తాను 18 గంటలు పనిచేస్తున్నాని చెప్పారు. ప్రజలందరి టాయిలెట్ల సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్‌ అని చెప్పుకొచ్చారు.

దేశంలో అగ్ని క్షిపణులను ప్రయోగించడం కన్నా టాయిలెట్ల సౌకర్య కల్పించడం అత్యంత ముఖ్యం. టాయిలెట్లు లేకుండా అగ్ని క్షిపణుల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు సహకరించే టాయిలెట్లకు మహాత్మాగాంధీకి నివాళిగా 'బాపు' అని పేరుపెట్టాలని సూచించారు. దేశంలో పారిశుద్ధ్య కార్యక్రమానికి గాంధీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
సంబంధిత సమాచారం
Feedback Print