జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అక్రమాస్తుల కేసు : జయ-శశికళకు సుప్రీంలో చుక్కెదురు (Jayalalitha | Sasikala | Bangalore | Supreme Court | da Case)
jayalalitha
File
FILE
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె ప్రియనెచ్చలి శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమకు వ్యతిరేకంగా సాగుతున్న అక్రమాస్తుల కేసు విచారణను నిలిపి వేయాలంటూ వారు దాఖలు చేసిన పిటీషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది.

అక్రమాస్తుల కేసులో ఇప్పటి వరకు సాగిన విచారణకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లను తమకు అందజేయాలంటూ వారు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అలాగే, ఈ కేసును విచారిస్తున్న బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయాలంటూ మరో పిటీషన్‌ను దాఖలు చేశారు.

ఈ పిటీషన్లపై విచారణ ముగిసేంత వరకు తమ అక్రమాస్తుల కేసు విచారణను నిలిపి వేయాలంటూ పురట్చితలైవి దాఖలు చేసుకున్న పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణ యధావిధిగా సాగుతుందని, అందువల్ల విచారణకు హాజరుకావాల్సిందేనంటూ కోర్టు స్పష్టం చేసింది.
సంబంధిత సమాచారం
Feedback Print