ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కర్ణాటకలో నాయకత్వం మార్పు! (Prez Poll | bjp | Delhi | Yaddyurappa | Sadananda Gouda)
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కర్ణాటకలో నాయకత్వం మార్పు!
బుధవారం, 4 జులై 2012( 11:17 IST )
File
FILE
కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా తెరపడింది. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పిడి అధిష్టానం సమ్మతించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప వర్గానికి చెందిన అసమ్మతి నేతలు శాంతించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి సదానంద గౌడను తప్పించి సీనియర్ నేత, జగదీష్ షెట్టార్‌ను నియమించాలన్న యడ్యూరప్ప డిమాండ్‌కు బీజేపీ అధిష్ఠానం తలొగ్గడంతో కొద్ది రోజులుగా కర్ణాటకలో కొనసాగుతున్న సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది.
జూలై 19 తర్వాత ముఖ్యమంత్రిగా జగదీష్ షెట్టార్‌ను నియమించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్పష్టమైన హామీ మేరకు అసమ్మతి మంత్రులు తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారని ఆ వర్గాలు ఉదహరిస్తున్నాయి. కాగా, సంక్షోభ నివారణలో భాగంగా ఇరు వర్గాల నేతలను ఢిల్లీకి పిలిపించి మంగళవారం విస్తృత చర్చలు జరిపి సమస్యకు తాత్కాలిక పరిష్కారం కనుగొంది.