జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » లక్ష్యాలు చేరుకోలేని వ్యక్తి మన్మోహన్ సింగ్ : టైమ్ మ్యాగజైన్ (Manmohan Singh | Time Magazine | India)
ఆశించిన ఫలితాలు సాధించని వ్యక్తిగా మన్మోహన్ సింగ్ అని అమెరికాకు చెందిన ప్రముఖ టైమ్ మ్యాగజైన్ అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణలో కీలక పాత్ర పోషించారంటూ సుదీర్ఘకాలంగా ప్రశంసలు అందుకున్న మన్మోహన్‌ ఇప్పుడు 'లక్ష్యాన్ని చేరుకోలేని వ్యక్తి' అనిపించుకున్నారు.

ఆ పత్రిక తాజా సంచికలో ఈ వ్యాఖ్యలు చేసింది. దేశాన్ని తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు సంస్కరణల అమలులో ఆయన ముందడుగు వేసేందుకు ఆయన విముఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని తెలిపింది. తాజా ఆసియా ఎడిషన్‌ కవర్‌ పేజీపై మన్మోహన్‌సింగ్‌ ముఖచిత్రాన్ని ముద్రించిన టైమ్‌ మ్యాగజైన్‌ దీనిని వచ్చే వారంలో విడుదల చేయనుంది.

ఆ కవర్‌ పేజీపై 'పరాజితుడు-భారత్‌కు పునరుత్తేజం అవసరం' అని శీర్షికను ప్రచురించింది. 'ఎ మ్యాన్‌ ఇన్‌ షాడో' శీర్షికతో వ్యాసాన్ని ప్రచురించిన టైమ్స్‌.... ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఫలితాన్ని సాధించారా? అని ప్రశ్నించింది.
సంబంధిత సమాచారం
Feedback Print