ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటీషన్‌పై స్పందించని కొత్త రాష్ట్రపతి! (Pranab Mukherjee | Afzal Guru's Mercy Plea | President)
అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటీషన్‌పై స్పందించని కొత్త రాష్ట్రపతి!
సోమవారం, 23 జులై 2012( 14:59 IST )
File
FILE
ఈనెల 25వ తేదీన దేశ కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రణబ్ ముఖర్జీ... 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన తీవ్రవాది అఫ్జల్ గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌పై స్పందించేందుకు నిరాకరించారు. ఇదే అంశంపై ఆయనను కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టేంత వరకు అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటీషన్‌పై స్పందించబోనని తేల్చి చెప్పారు.
బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షమాభిక్ష పిటీషన్‌ను లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. కాగా, రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ముందుండే అత్యంత కీలకమైన అంశాల్లో అఫ్జల్ గురు క్షమాభిక్ష అంశమొకటి.
ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే.. శివసేన తక్షణం స్పందించింది. అప్జల్ గురు వినతి ప్రణబ్ ముఖర్జీ తోసిపుచ్చాలని ఆ పార్టీ చీఫ్ బాల్‌థాక్రే సూచించారు. ప్రణబ్ ముఖర్జీపై ఎంతో ఆశిస్తున్నామని, అందువల్ల అఫ్జల్ గురు పిటీషన్‌ను తోసిపుచ్చాలని సూచించారు.