జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఉత్తరాది పవర్ గ్రిడ్ ఫెయిల్ : అంధకారంలో 12 రాష్ట్రాలు (Power Grid | Delhi Metro Rail | North India)
ఉత్తర భారతదేశం మరోమారు అంధకారంలో చిక్కుకుంది. సోమవారం ఈశాన్య పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో ఎనిమిది రాష్ట్రాలు చీకట్లో ఉన్న విషయం తెల్సిందే. ఈ ఫెయిల్యూర్‌కు సంబంధించి ఏడుగురు ఐఏఎస్ అధికారులపై కేంద్ర విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.

దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడక ముందే.. మంగళవారం నార్త్‌ర్న్ పవర్ గ్రిడ్ ఫెయిల్ అయింది. డిమాండ్‌ ఎక్కువగా ఉండటం, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టు సమాచారం. దీంతో ఉత్తరభారతంలోని 12 రాష్ట్రాలు అంధకారంలో చిక్కుకున్నాయి.

పవర్ లేక పోవడంతో ఢిల్లీలో మెట్రో రైల్ సేవలు పూర్తిగా నిలిచి పోయాయి. ఆస్పత్రులు వంటి అత్యంతవసర సర్వీసులు మాత్రం పవర్ బ్యాకప్‌తో పని చేస్తున్నాయి. ఈ సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, ఛత్తీస్‌గఢ్, అస్సోం, మహారాష్ట్రలతో పాటు మొత్తం 12 రాష్ట్రాలు అంధకారంలో చిక్కుకున్నాయి.
సంబంధిత సమాచారం
Feedback Print