ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అన్నా హజారే ఓ మోసకారి : ఇండోర్ కోర్టులో ఫిర్యాదు! (Anna Hazare | Court | Ramdev | Team Anna)
అన్నా హజారే ఓ మోసకారి : ఇండోర్ కోర్టులో ఫిర్యాదు!
శుక్రవారం, 10 ఆగస్టు 2012( 11:14 IST )
File
FILE
సామాజిక ఉద్యమకర్త ముసుగును ధరించిన అన్నా హజారే ఓ మోసకారని, ఆయన లోక్పాల్ ఉద్యమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఇండోర్‌కు చెందిన ఒక న్యాయవాది స్థానిక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సమర్థవంతమైన లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం చేస్తున్నామంటూ అన్నా హజారేతో పాటు.. అన్నా బృందం సభ్యులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆ న్యాయవాది ఆరోపించారు.
ఇండోర్‌కు చెందిన ఇంద్రజీత్ సింగ్ భాటియా అనే న్యాయవాది ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సుమన్ శ్రీవాత్సవ కోర్టులో ఆ ఫిర్యాదు చేశారు. ఈ నెల 14వ తేదీన తన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరుపుతుందని భాటియా మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజకీయ పార్టీకి ప్రాతిపదికను తయారు చేసుకోవడానికి ప్రజలను అన్నా హజారే, ఆయన బృందం తప్పు దోవ పట్టించారని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు.