జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 14వ ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ పదవీ ప్రమాణం (Hamid Ansari Sworn in as 14Th Vice President)
FILE
హమీద్ అన్సారీ 14వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. శనివారంనాడు ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో 75 ఏళ్ల అన్సారీ మరోసారి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు.

యూపీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో దిగిన అన్సారీ, ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్వంత్ సింగ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. మొత్తం 728 ఓట్లకు గాను అన్సారీకి 490 ఓట్లు వచ్చాయి. దీంతో అన్సారీకి మరోసారి ఉపరాష్ట్రపతి పదవి దక్కింది.
సంబంధిత సమాచారం
Feedback Print