ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » హిమాచల్ ప్రదేశ్ లోయలో పడ్డ బస్సు... 52 మంది మృతి (52 Killed, 46 Injured as bus Falls Into Gorge in Himachal Pradesh)
హిమాచల్ ప్రదేశ్ లోయలో పడ్డ బస్సు... 52 మంది మృతి
శనివారం, 11 ఆగస్టు 2012( 20:12 IST )
FILE
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడ్డ దుర్ఘటనలో 52 మంది మృతి చెందగా 46 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో 18 మంది మహిళలుండగా ఇద్దరు చిన్నారులున్నారు.
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లా ఎత్తయిన ప్రదేశం ద్వారా ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటంతో బస్సు టైరు పంక్చరయింది. దీంతో డ్రైవరు బస్సుపై నియంత్రణ కోల్పోయాడనీ, ఫలితంగా అదుపు తప్పి లోయలోకి పడిపోయిందని పోలీసులు చెపుతున్నారు.
ఈ దుర్ఘటన చంబా జిల్లాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేరా వద్ద చోటుచేసుకుంది. బస్సు పడిపోయన లోయ లోతు సుమారు 250 అడుగులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.