ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కూడంకుళం అణు విద్యుత్ అంతా మాకే ఇవ్వాలి : జయ (Jayalalithaa Wants Power Generated From Kudankulam Only for tn)
కూడంకుళం అణు విద్యుత్ అంతా మాకే ఇవ్వాలి : జయ
ఆదివారం, 19 ఆగస్టు 2012( 15:14 IST )
File
FILE
తిరునెల్వేలి జిల్లా కూడంకుళంలో నిర్మించే అణు విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా తమకే కేటాయించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరోమారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీపడబోమని ఆమె ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తొలి రియాక్టర్ ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ రియాక్టర్‌లో వచ్చే నెల నుంచి విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తాన్ని తమ రాష్ట్రానికే కేటాయించాలని కేంద్రాన్ని జయలలిత కోరారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆమె లేఖ రాశారు.
గతంలో ఇదే విధంగా ఆమె పలు లేఖలను కేంద్రానికి రాశారు. అయితే, అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో తాజాగా మరో లేఖను రాశారు. మరోవైపు ఈ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికంగా అనేక రకాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.