ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కోల్గేట్ దుమారం : విశ్వాస పరీక్షకు యూపీఏ-2 సిద్ధమా? (Coalgate Scam | Deadlock in Parliament | Upa-2 Likely to Move Confidence Motion)
బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవకతవకలకు తనదే పూర్తి బాధ్యత అంటూ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించినప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం ఏమాత్రం శాంతించడం లేదు. బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి.
అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజీనామా చేసే ప్రసక్తేలేదని తేల్చి చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విశ్వస పరీక్షను ఎదుర్కోవాలని యూపీఏ-2 వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరీక్షపై వచ్చే వారమే ఓటింగ్ నిర్వహించి ప్రభుత్వం బలాన్ని ప్రతిపక్షాలకు మరోమారు చాటి చెప్పాలనే ధోరణిలో యూపీఏ-2 ఉన్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారంగా తెలుస్తోంది.