ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » డీజిల్ ధరల పెంపునకు నిరసనగా బెంగాల్‌లో రవాణా సమ్మె! (Transport Strike | West Bengal | Mamata Banerjee | Diesel Price Hike)
డీజిల్ ధరల పెంపునకు నిరసనగా బెంగాల్‌లో రవాణా సమ్మె!
సోమవారం, 17 సెప్టెంబర్ 2012( 14:09 IST )
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ప్రైవేట్ వాహన యజమానుల నిరవధిక వాహనాల సమ్మెకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలకు నిరసనగా ఈ సమ్మెకు దిగారు. దీంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ఈ సమ్మెలో సమారు 37 వేల పైచిలుకు ప్రైవేట్ బస్సులు పాల్గొన్నాయి. దీంతో సుమారు 40 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన బస్సులు యధావిధిగా తిరుగుతున్నప్పటికీ... ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదని స్థానిక రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేటు బస్సు సర్వీసులు పూర్తిగా అందుబాటులో లేక పోవడంతో మెట్రో రైళ్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. అలాగే, టాక్సీలు, ఆటో రిక్షాల డ్రైవర్లు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు మాత్రం పెంచిన డీజిల్ ఛార్జీలను తగ్గించేంత వరకు బస్సులను రోడ్లపై తిప్పే ప్రసక్తే లేదని ప్రకటించారు.