Widgets Magazine

సోనియా డిశ్చార్జ్ .. ఆరోగ్యం భేష్ : ఎయిమ్స్ వైద్యులు

మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:16 IST)

Widgets Magazine

sonia gandhi
File
FILE
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి మంగళవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆహార భద్రతా బిల్లుపై సోమవారం రాత్రి లోక్‌సభలో వాడివేడిగా చర్చ సాగుతున్న సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఛాతినొప్పి రావడంతో కేంద్ర మంత్రి సెల్జా, సోనియా తనయుడు రాహుల్ గాంధీలు హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

వాస్తవానికి సోనియా గాంధీ ఆదివారం రాత్రి నుంచి వైరల్ జ్వరంతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆమె తన ఇంట్లోనే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం ఆహార భద్రతా బిల్లుపై పార్లమెంటులో జరిగిన సుదీర్ఘ చర్చలో సోనియా పాల్గొన్నారు. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలింది.

అయితే... రాత్రి 8.15 గంటల సమయంలో సోనియా స్వల్పంగా ఛాతినొప్పితో పాటు.. తీవ్రమైన అలసటకు గురయ్యారు. ఫలితంగా సభలో కూర్చోలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో... కేంద్ర మంత్రి సెల్జా, కుమారుడు రాహుల్‌ గాంధీలు తోడు రాగా సభ నుంచి బయటికి నడిచారు.

ఒక దశలో కొద్దిగా తూలిపడిన సోనియా... వెంటనే సెల్జా ఆసారా తీసుకున్నారు. వాహనంలో కూర్చుని నేరుగా ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఎయిమ్స్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ ఆర్.సి.దేకాతోపాటు పలువురు వైద్య నిపుణులు సోనియాను పరీక్షించారు. ఆమెను హృద్రోగ విభాగంలో అడ్మిట్ చేసి పలు పరీక్షలు నిర్వహించారు.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. మంగళవారం ఉదయానికి ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఇంటికి డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.


ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.


Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

అమిత్ షాకు షాక్: అప్పుడేమో రజనీకాంత్.. ఇప్పుడేమో విజయకాంత్!!

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు తమిళనాట షాకులే ఎదురవుతున్నాయి. తమిళనాట బీజేపీని బలోపేతం చేయాలనే ...

పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు: ముమ్మరంగా సహాయచర్యలు

తమిళనాడులోని సోమనాయినిపట్టి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐలాండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ...

లేటెస్ట్

క్యాన్సర్ వ్యాధిపై అవగాహనకు గౌతమి లైఫ్ ఎగైన్ ఆర్గనైజేషన్

క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు, క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రముఖ నటి గౌతమి ...

ఆకాశం నుంచి రివ్వున దూసుకొచ్చి వేలూరు కాలేజీలో పడి పేలింది.. ఒకరు మృతి, ఏంటది?

ఆకాశం నుంచి ఓ వస్తువు అత్యంత వేగంగా రివ్వుమంటూ దూసుకొచ్చి వేలూరుకి సమీపంలో ఉన్న భారతీదాసన్ ...