Widgets Magazine

ఆహార భద్రతా బిల్లుకు లోక్‌‍సభ ఆమోదం: సోనియా దూరం

Widgets Magazine

Sonia
FILE
ఆహార భద్రతా బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మానస పుత్రికగా అభివర్ణిస్తున్న ఈ బిల్లు ఆమోదం ఆమె సభలో లేకుండానే జరిగిపోవడం గమనార్హం. 9 గంటలపాటు చర్చ జరిగిన తర్వాత... రాత్రి 11 గంటల సమయంలో మూజువాణి ఓటుతో ఈ బిల్లును సభ ఆమోదించింది.

సోమవారం ఆహార భద్రతా బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో ఆమె కూడా పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు ప్రసంగిస్తున్న సమయంలో అంటే రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆమెకు ఛాతి నొప్పి రావడంతో హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బిల్లుపై ఆమోదముద్ర వేశారు.

ఈ బిల్లు చర్చా సమయంలో విపక్ష సభ్యులు దాదాపు 300 సవరణలు ప్రతిపాదించారు. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ యూపీఏ-2 ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో పాటు.. ఎస్పీ, బీఎస్పీ కూడా మద్దతు తెలుపడంతో సులభంగా ఆమోదముద్ర పడింది.

కాగా, ఈ బిల్లు వల్ల యేడాదికి రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనివల్ల దేశ జనాభాలో 82 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారు. పథకం అమలుకు నోచుకున్న తర్వాత 6.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ చేస్తారు.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

2019 ఎన్నికల్లో జగన్ గెలవాలంటే ఏం చేయాలి? పవన్, ఎన్టీఆర్ రంగంలోకి దిగితే?

2014 సార్వత్రిక ఎన్నికలు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చిన నేపథ్యంలో.. 2019 ఎన్నికలపై ...

వైకాపాలో జంపింగ్‌ల గోల.. పార్టీ మారాలంటే.. ఫేస్ బుక్ ప్రొఫైల్ మార్చేస్తే పోలా!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీకి జంపింగ్ గోల పెరిగిపోతోంది. రోజు ...

లేటెస్ట్

నిరసన జ్వాలలు ఉత్తుత్తివే.. అంతా ఓ తమాషా : డోనాల్డ్ ట్రంప్

తనకు ఎన్నికల ప్రచారంలో ఎదురవుతున్న నిరసనలపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తనదైశైలిలో ...

దళితవాడల్లో పాఠశాలలు మానేసిన పిల్లలందరినీ తిరిగి చేర్పిస్తాం : కారెం శివాజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితవాడల్లో పాఠశాలలు మానేసిన పిల్లలందరినీ తిరిగి చేర్పించేందుకు తీవ్రంగా ...

Widgets Magazine
Widgets Magazine