జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » విజయ్ కాంత్‌కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు!: డీఎండీకేతో...
FILE
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎండీకే పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

డీఎండీకే వ్యవస్థాపకుడు, ప్రతిపక్ష నేత 'కెప్టెన్' విజయ్ కాంత్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలుపడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గత కొద్దికాలంగా డీఎండీకేతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనే వార్తలకు ఈ సంఘటన కొంత బలం చేకూర్చింది.

అయితే విజయ్ కాంత్‌తో రాహుల్ మాట్లాడటం వెనుక ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు లేవని డీఎండీకే పార్టీకి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ పొత్తుల గురించి మాట్లాడటం తొందరపాటుతనమే అని అన్నారు. సరియైన సమయంలో తమ నాయకుడు పొత్తుల గురించి నిర్ణయం తీసుకుంటారన్నారు.
Feedback Print