తెలంగాణ బిల్లుకు పెద్దల సభ రాజ్యసభ గురువారం రాత్రి ఆమోదముద్ర వేసింది. దీంతో భారతదేశంలో 29వ రాష్ట్రంగా హైదరాబాద్ రాజధానితో పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడంతో 58 యేళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరినట్టయింది.