| ఇంకా చదవండి |
| రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు రాష్ట్రపతి పాలన దిశగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కె.రోశయ్య తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన సొంత పార్టీ నేతలు అవలంభిస్తున్న వైఖరితో కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వారికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు వినికిడి. | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అంశం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్ష ప్రకటనలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఆమరణ దీక్షకు వెళుతున్న కేసీఆర్‌ను రాష్ట్ర పోలీసు యంత్రాంగం బలవంతంగా అరెస్టు చేయడంతో తెలంగాణ ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. |