ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » రౌండప్ 2010 » చేదు .. తీపి గుర్తుల మేళవింపు 2010 (2010 India | Kashmire | Yedurappa | Bihar | Niteesh Kumar)
Bookmark and Share Feedback Print
 
PTI
2010 సంవత్సరానికి విమాన ప్రమాదం స్వాగతం పలికింది. ఆ తర్వాత అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నాయి. అనేక రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచింది. ఆరు దశాబ్దాలుగా కోర్టులో నలుగుతూ వచ్చిన వివాదస్పద అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు వెలువడింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

దేశ ప్రజలనే కాకుండా ప్రపంచ దేశాలు నివ్వెర పోయేలా చేసిన 1.76 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్, సీడబ్ల్యూజీ, కాశ్మీర్ అల్లర్లు, దతెంవాడలో 75 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల ఊచకోత, భోపాల్ గ్యాస్ విషాదంపై కోర్టు తీర్పు, పరవురు హత్యలు (హానర్ కిల్లింగ్స్), చివరగా పార్లమెంట్ ప్రతిష్టంభన ఇలా అనేక సంఘటనలను తనలో ఇనుమడింపజేసుకుని 2011కు స్వాగతం పలుకుతూ 2010 హాయిగా సెలవు తీసుకోనుంది. ఈ 365 రోజుల్లో చోటు చేసుకున్న విపత్తులు, చిత్ర.. విచిత్ర... అనూహ్య.... రాజకీయ పరిణామాలను ఒకసారి అవలోకనం చేసుకుంటే..

జనవరి నెల ఆరంభంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకేరోజు మూడు రైలు ప్రమాదాలు జరిగి 10 మంది మృత్యువాత పడ్డారు. తిరువనంతపురంలో 97వ సైన్స్ కాంగ్రెస్ మహాసభలను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ జన క్రాంతి పార్టీని నెలకొల్పారు. ఈ నెలలో పెద్ద సంచలనాలు చోటు చేసుకోకుండా ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి నెలలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన కుడిభుజం లాంటి అమర్ సింగ్, జయప్రదలను పార్టీ నుంచి బహిష్కరించారు.

అలాగే, 13వ ఆర్థిక సంఘం సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇలా మెల్లగా సాగిపోతున్న 2010 కాలగమనంలో మంగుళూరులో జరిగిన విమానప్రమాదం దేశ ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. దుబాయ్ నుంచి 166 మంది మంగళూరుకు తిరిగి వస్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ బోయింగ్‌ విమానం మే నెల 22వ తేదీ తెల్లవారుజామున 6.30 గంటలకు మంగళూరు విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 158 మంది మరణించారు. టేబుల్ టాప్ రన్‌ కలిగిన మంగుళూరులో కో పైలట్‌ చేసిన సూచనలను పైలట్‌ పట్టించుకోక పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది. ఈ ప్రమాదం నుంచి ఎనిమిది మంది సజీవంగా బయటపడ్డారు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.