Webdunia RSS ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కేసీఆర్ (Telangana Movement Kcr)
ఢిల్లీలోని నంబర్ టెన్ జన్‌పథ్‌ కాపలా కుక్కలా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ అంశంపై కేసీఆర్ నిజస్వరూపం ఇపుడిపుడే బయటపడుతోందన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. ఇపుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసమైన నంబర్ టెన్ జన్‌పథ్‌కు కాపలా కుక్కలా మారారని చెప్పారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పనుకుంటే.. టీఆర్ఎస్ కార్యకలాపాలను, టి రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చూసుకుంటున్నారన్నారు. డిసెంబర్‌ నెలఖారుకల్లా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలిస్తామని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వట్టి నీటి మూటలే నని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
  ఇంకా చదవండి
 
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి సంబంధిత మంత్రులతో చర్చించామన్నారు.
 
గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తాము టిక్కెట్లు కేటాయిస్తే ఆ పార్టీ గెలుచుకుదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీని ఎదుర్కొనే దమ్మూ సత్తా ఏ పార్టీకి లేదన్నారు.