రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » తారాఫలం » రామ్‌చరణ్ (Ramcharan)
తారాఫలం
Feedback Print Bookmark and Share
 
పుట్టిన తేదీ : 27 మార్చి, 1985
అదృష్ట సంఖ్యలు : 4,7,8

వారసత్వంతోనే నటనను పుణికి పుచ్చుకుని తండ్రి, తాతల ఆశీస్సులతో చిత్రరంగంలో వెలుగుతున్న నటుడు రామ్‌చరణ్. తొలి చిత్రం చిరుతతోనే అందరి మదిని దోచుకుని, శభాష్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. తండ్రికి ఏ మాత్రం తీసిపోడు అనేలా నటనలో, సంస్కారంలో, గౌరవంలో అందరినీ మెప్పిస్తున్నాడు.

ప్రస్తుతం జెనీలియాతో రెడీ చిత్రంలో నటించాడు. తండ్రి అంత పెద్ద నటుడైనప్పటికీ, ఎలాంటి గర్వాలు ప్రదర్శించకుండా తన స్వశక్తితో పైకి రావాలని ఆశిస్తాడు. ఇదంతా మెగాస్టార్ పెంపకం వలనే అని కూడా చెప్పవచ్చు. అందరినీ సమానంగా చూడడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటివి ఇతనికి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి.

అయితే అందరినీ తేలికగా నమ్మే గుణం చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కునేందుకు సిద్ధపడే తత్వం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం, కళ్లలోకి చూస్తేనే కనిపించే తేజస్సు వంటివి పెట్టని ఆభరణాలుగా ఉంటాయి. ఈ లక్షణాలు ఇతనికి మాత్రమే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ వర్తిస్తాయి.

మిత్రుల ఎంపిక విషయంలో జాగ్రత పడడం అవసరం. క్రికెట్ ఆడడం, అమ్మతో కబుర్లు చెప్పడం, నాన్న వద్ద పాఠాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం వంటివి ఇష్టమైన హాబీలు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రామ్చరణ్ టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరు నటవారసుడు చిరుత