రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ఫెంగ్ షుయ్ » మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే...?
ఫెంగ్ షుయ్
Feedback Print Bookmark and Share
 
FILE
నిజమైన క్రిస్టల్‌తో చేసిన ఏ వస్తువైనా మీ టేబుల్ ఎడమచేతివైపు పెట్టడం ద్వారా మీ కెరీర్‌ని శీఘ్రంగా అభివృద్ధి చేసుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. క్రిస్టల్ చెట్టు, క్రిస్టల్ పేపర్ వెయిట్, క్రిస్టల్ గ్లోబ్‌లను మీ టేబుల్ మీద ఉంచినట్లైతే ఉన్నత పదవులను అలంకరిస్తారని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

అదే విధంగా... క్రిస్టల్ గ్లోబును మీ టేబుల్ మీద ఈశాన్యం దిశగా ఉంచి, ప్రతిరోజూ మూడు సార్లు ఆ గ్లోబ్‌ని త్రిప్పినట్లైతే... మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.

ఇకపోతే... క్రిస్టల్ గ్లోబుని మీ పిల్లల టేబుల్ మీద ఈశాన్య భాగంలో ఉంచడం ద్వారా... మీ పిల్లల విద్య, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

భూమి నుంచి తీసిన రియల్ క్రిస్టల్ రాయిని వాస్తుదోషం ఉన్నచోట పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాల్ని పొందవచ్చు.

హృదయాకారంలో ఉన్న పింక్ క్రిస్టల్స్ రెండింటిని.. మీ పిల్లల బెడ్ రూమ్‌లో ఉంచినట్లైతే... వారికి మంచి పెళ్ళి సంబంధాలు కుదరడం జరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి ఫెంగ్షుయ్ పిల్లల టేబుల్ జ్ఞాపకశక్తి విద్య క్రిస్టల్ గ్లోబు బెడ్ రూమ్ పెళ్లి సంబంధాలు