రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ఫెంగ్ షుయ్ » మీ పుట్టినరోజు సోమవారాల్లో వస్తుందా..?
ఫెంగ్ షుయ్
Feedback Print Bookmark and Share
 
FILE
మీ పుట్టినరోజు సోమవారాల్లో వస్తుందా..? లేదా మీ బంధువుల ఇంట్లో ఏదైనా ప్రత్యేక పార్టీలాంటిది సోమవారం ఉందనుకున్నప్పుడు... ఆ రోజు తెల్లని, లేత నీలిరంగు లేదా కొద్దిగా వెండిఛాయ కలిగిన దుస్తులు ధరించడం మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఇలా చేస్తే.. ఆ ఫంక్షన్‌లలో ఎన్నడూ మిమ్మల్ని లెక్కచేయని వారు కూడా మీకు ఓ ప్రత్యేకతనిస్తూ మాట్లాడే అవకాశాలున్నాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

ఇలా ఫంక్షన్లకే కాదు.. కాలేజీలకైనా .. మీ ఆఫీసులో అయినా క్రమంగా సోమవారాలు అలాంటి డ్రెస్సులే వేసుకుంటే నెమ్మదిగా మీకున్న ప్రతికూలతలు తప్పక తొలగిపోతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం ద్వారా మీలో రెండింతల ఆత్మవిశ్వాసం చేకూరి, మీకే తెలియని ఉత్సాహంతో పనిచేయగలుగుతారని వారు చెబుతున్నారు.

ఒకవేళ పూర్తి తెలుపు రంగు దుస్తులే మీ వద్ద లేని పక్షంలో... ఆ రంగుతో సరిపడే బార్డర్‌లు లేదా షేడ్స్, పువ్వులు, గీతలు ఇలా తెలుపు రంగుతో కలిసేటట్లుగా ఉండే దుస్తులను ఎంచుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ శాస్త్రం పేర్కొంటోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి ఫెంగ్షుయ్ పుట్టినరోజు సోమవారం పార్టీ బంధువులు కాలేజీ ఆఫీసు తెల్లరంగు దుస్తులు