రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ఫెంగ్ షుయ్ » దంపతులిద్దరూ ఒకే పరుపు మీద శయనిస్తున్నారా? (Couples| Mariage| Double bed| Bed Room| Toilet| Mirror)
ఫెంగ్ షుయ్
Feedback Print Bookmark and Share
 
FILE
వివాహ బంధంతో ఒకటైన దంపతులిద్దరూ ఒకే పరుపు మీదే శయనించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఎక్కువ మంది దంపతులు ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనిస్తారు.

అయితే రెండు పరుపుల మీద దంపతులు శయనించడం మంచిది కాదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అలా రెండు పరుపుల మీద పడుకున్న దంపతుల మధ్య విభేదాలు, కాలానుగుణంగా విడిపోయే అవకాశాలున్నాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం కంటే.. చెరో బెడ్‌రూమ్‌లో పడుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అంతేగాని ఒకే మంచానికి రెండు ప్రత్యేక పరుపులు వేసుకోకూడదు. అదేవిధంగా ఒకే బెడ్‌రూమ్‌లో రెండు మంచాలు ఉండకూడదు.

అదేవిధంగా..మీ మంచానికెదురుగా టాయ్‌లెట్‌గాని, అద్దాలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ లేకుండా తగిన చర్యలు తీసుకోవడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. ఒకే మంచం-రెండు పరుపులు అశుభానికి నిదర్శనమని వారు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: దంపతులు, వివాహం, డబుల్ కాట్ మంచం, రెండు పరుపులు, బెడ్రూమ్, టాయ్లెట్, అద్దాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు