రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ఫెంగ్ షుయ్ » ఫ్యాషన్ అంటూ చిరిగిన దుస్తులు వేసుకోకండి (Fengshui| Dresses| Fashion| Pant| Shirt)
ఫెంగ్ షుయ్
Feedback Print Bookmark and Share
 
WD
ఆధునిక కాలంలో చాలామంది యువతీ యువకులు ఫ్యాషన్ పేరిట రంధ్రాలు ఉంచిన చొక్కా, ప్యాంట్‌లను ధరిస్తున్నారు. ఇలాంటి రంధ్రాలు పడిన దుస్తులు వేసుకోవడం అంతమంచిది కాదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

రంధ్రాలు గల దుస్తులు, చిరిగిన వస్త్రాలు దారిద్ర్యానికి చిహ్నాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇలాంటి రంధ్రాలు గల, అక్కడక్కడా చిరుగులున్న దుస్తులను వీలైనంతవరకు ధరించవద్దని ఫెంగ్‌షుయ్ అంటోంది.

ఇంకా మీరు ఆఫీసు నుంచి రాగానే వేసుకున్న బట్టలు తీసేసి వేరే దుస్తులు ధరించండి. ఎప్పుడూ చూసినా కడిగిన ముత్యంలా కనిపించే వారి ఇంటికే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని పండితులు అంటున్నారు. అందుచేత ముఖాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి.

అదేవిధంగా రాత్రి వేళల్లో బట్టలు ఉతికి, బయట ఆరవేయడం మంచిది కాదు. అలా రాత్రి వేళ ఉతికి ఆరేసిన బట్టలు అతీత శక్తులను ఆకర్షిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

గాలి, వెలుతురు, నీరు ఎంత ముఖ్యమో ఇంటి శుభ్రత కూడా అంతే ముఖ్యమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అందుకే ఇంట్లో పనికి రాని వస్తువుల్ని అప్పటికప్పుడు తీసి బయట పారేయాలని, ఇంటిని అప్పటికప్పడు శుభ్రం చేస్తూ ఉండాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఫెంగ్షుయ్, దుస్తులు, ఫ్యాషన్, ప్యాంట్, చొక్కా, రాత్రి, ఇళ్లు, రంధ్రాలు