రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » రత్నాల శాస్త్రం » పుష్యమి నక్షత్రం.. 1వ పాదములో పుట్టిన వారైతే..? (Pushyami | Nakshatra | Blue | pearl | Green | Gold | Silver | Religion | Astrology | Gemology)
రత్నాల శాస్త్రం
Bookmark and Share Feedback Print
 
FILE
పుష్యమి మొదటి పాదంలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో నీల రత్నాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. పుష్యమి తొలి పాదంలో జన్మించిన జాతకులకు 19 సంవత్సరాల కాలం పాటు శని మహర్దశ జరగడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి.

అలాగే 19 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఈ జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చ రత్నమును బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలికి ధరిస్తే శుభఫలితాలుంటాయి.

పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన జాతకులు 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారంతో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయి.

ఇకపోతే.. 63-69 సంవత్సరాల వరకు ఈ జాతకులకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. ఇదేవిధంగా 69-79 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించగలరు.

అలాగే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయని రత్నాల శాస్త్రం చెబుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పుష్యమి, నక్షత్రం, నీలం, పగడము, ముత్యము, పచ్చ, వెండి, బంగారము, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, రత్నాల శాస్త్రం