రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » రత్నాల శాస్త్రం » జ్యేష్ట నక్షత్రము ఒకటో పాదములో పుట్టారా..? (Jyesta Nakshatra | Tuesday | Monday | Religion | Astrology | Gemology)
రత్నాల శాస్త్రం
Bookmark and Share Feedback Print
 
FILE
జ్యేష్ఠ నక్షత్రము ఒకటో పాదములో జన్మించిన జాతకులు పచ్చను బంగారముతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 11 సంవత్సరాల వరకు ఈ జాతకులకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారముతో పొదిగించుకుని ధరించడం శ్రేయస్కరం.

అలాగే 12వ వయస్సు నుండి 24 సంవత్సరములు వరకు కేతు మహర్ధశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఇంకా 24-44 సంవత్సరాల వరకు శుక్ర మహర్ధశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు.

జ్యేష్ట నక్షత్రము తొలిపాదములో పుట్టిన జాతకులకు 44-50సంవత్సరముల వరకు రవి మహర్ధశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంకా 50-60 వరకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. అలాగే 60-67 సంవత్సరముల వరకు కుజ మహర్ధశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు.

ఇంకా.. 67 సంవత్సరముల నుంచి 88 సంవత్సరముల వరకు రాహు మహర్ధశ కావడంతో గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.

జ్యేష్ట నక్షత్రం ఒకటో పాదములో పుట్టిన జాతకులకు పసుపు, ముదురు పచ్చ రంగులు కలిసివస్తాయి. అలాగే 9, 9, 18, 36, 1, 2, 3 అనే సంఖ్యలు శుభఫలితాలనిస్తాయి. అలాగే 6, 8 అనే సంఖ్యలు సామాన్య ఫలితాలను అందజేస్తాయి. కానీ 4, 5, 6 సంఖ్యలు మాత్రం అనుకూలించవు.

ఇకపోతే.. జ్యేష్ట నక్షత్రం తొలిపాదములో పుట్టిన జాతకులకు మంగళవారం శుభం. సోమ, బుధవారాలు కూడా వీరికి అదృష్టానిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జ్యేష్ట నక్షత్రం, మంగళవారం, సోమవారం, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, రత్నాల శాస్త్రం