Widgets Magazine Widgets Magazine

మీనరాశిలో పుట్టారా? ఐతే కనకపుష్యరాగం ధరించండి

Widgets Magazine

FILE
మీనరాశిలో పుట్టిన జాతకులు కనకపుష్యరాగం ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కనకపుష్యరాగం ధరించడం ద్వారా గురుగ్రహదోషాలు తొలగిపోతాయి. బలము, నూతనోత్సాహం, నేత్రజ్యోతి పెరుగుతుంది. టోపాజ్ అని పిలువబడే పుష్యరాగ రత్నాన్ని ధరించే మీనరాశి జాతకులకు ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి. దయాహృదయులు, ధైర్యవంతులు, కష్టజీవులుగా ఉండే మీనరాశి జాతకులు పుష్యరాగం ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

కనకపుష్యరాగం ఎలా ఉంటుందంటే..?
పసుపు రంగును కలిగి ఉండే కనకపుష్యరాగంపై ఎటువంటి చారలు వుండవు. పుష్యరాగంలో కనకపుష్యరాగం, శ్వేత పుష్యరాగం అనే రెండు రకాలు కలవు. పుష్యరాగము ఎలా ఉంటుందంటే..? పారదర్శకము మరియు కాంతివంతముగా వుంటుంది. అసలైన కనకపుష్యరాగమును ఎండలో ఉంచితే వెలుగు వ్యాప్తి చెందుతుంది. పుష్యరాగమును చేతిలో తీసుకుంటే బరువుగా ఉంటుంది.

ఎలా ధరించాలంటే..?
గురువారం సూర్యోదయానికి ధరించాలి. బంగారపు లోహములో పొదిగించి, కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. ముందుగా పాలులోగానీ, గంగాజలములో గానీ శుద్ధి చేయాలి. గురు ధ్యాన శ్లోకములు 160 మార్లు ధ్యానించి ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సకల సంపదలు చేకూరుతాయని రత్నాల శాస్త్రం చెబుతోంది.

ఇకపోతే.. మీనరాశిలో జన్మించిన జాతకులకు మూడు, ఏడు మరియు 12, 21, 30, 48, 57, 66, 75, 7, 16, 25, 34, 43, 52, 61, 70 అనే సంఖ్యలు కలిసొస్తాయి. వీటితో పాటు 1, 2, 9 అనే సంఖ్యలు కూడా సామాన్య ఫలితాలను ఇస్తాయి. అయితే 5, 6 అనే సంఖ్యలు మాత్రం కలిసిరావని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే మీనరాశి జాతకులకు ఎరుపు, పసుపు వంటివి అనుకూలిస్తాయి. ఈ రంగుల్లో దుస్తులు ధరించడం ద్వారా మనశ్శాంతి నెలకొంటుంది. ఇందులో పసుపు రంగు చేతి రుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.

మరోవైపు.. మీనరాశి జాతకులకు గురువారం శుభ ఫలితాలనిస్తుంది. గురువారం ప్రారంభించే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే ఆది, సోమవారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. కానీ బుధవారం మాత్రం ఈ రాశి జాతకులకు అంతగా కలిసిరావు. అలాగే మంగళవారంలో చేబదుళ్ళు తీసుకోవడం, ఇవ్వడం కూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

భవిష్యవాణి

వాస్తు ప్రకారం ఇంటిని స్వర్గధామంలా మార్చుకోండి!

మీ ఇల్లు స్వంతమైనా కావచ్చు, లేదా బాడుగదైనా కావచ్చు. మనం ఉంటున్న ఇంటిని అలంకరించుకోవడానికి ...

మీరు మేషరాశి జాతకులా.. అయితే ధనవంతులే!

మేషరాశిలో జన్మించిన జాతకులకు ఆస్తి కొదవంటూ ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశిలో ...

ఒకే మంచంపై రెండు పరుపులు వేసుకుని నిద్రిస్తే అశుభమా?

పడకగదిలో ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం అశుభమని ఫెంగ్‌షుయ్ ...

మహిళలూ... మీరు తులా, వృశ్చిక లగ్నంలో జన్మించారా?

తులా, వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళలు విద్యారంగం, వృత్తిపరంగా ముందంజలో నిలుస్తారు. ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

అందుకే ఫిన్లాండ్ వర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్... మనలా రెండున్నరేళ్లకే పిల్లకు టార్చర్ లేదక్కడ... మరెలా...?

ఫిన్‌ల్యాండ్ అనేది ప్ర‌పంచప‌టంలో ఓ చిన్న దేశం. కానీ, విద్యా రంగంలో ప్ర‌పంచంలోనే ఫిన్లాండ్ నెంబ‌ర్ ...

తిరుమలలో శ్రీవారి ఏనుగు ఆశీర్వదిస్తే "అరకోటి"... ఏనుగు తోక వెంట్రుకల్లో కూడా...

elephant

భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతారు. ఎందెందు వెతికినా అందందు కనిపిస్తాడన్నది భక్తుల అంచంచల ...

Widgets Magazine

లేటెస్ట్

అందుకే ఫిన్లాండ్ వర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్... మనలా రెండున్నరేళ్లకే పిల్లకు టార్చర్ లేదక్కడ... మరెలా...?

ఫిన్‌ల్యాండ్ అనేది ప్ర‌పంచప‌టంలో ఓ చిన్న దేశం. కానీ, విద్యా రంగంలో ప్ర‌పంచంలోనే ఫిన్లాండ్ నెంబ‌ర్ ...

పరిణీతి చోప్రాకు హాలీవుడ్ ఆఫర్.. ప్రియాంక, దీపికాల తర్వాత పరిణీతి కూడా?!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి ...

మరిన్ని విశేషాలు....

ఆ కోరికలు వాళ్ళకే ఎక్కువ...మగాడ్ని పడకమీదికి రప్పించడం..!

శృంగారం విషయంలో పురుషుల కంటే మహిళలకే సిగ్గు బిడియం కాస్త ఎక్కువ. బిడియం వారిని వెనక్కి లాగుతూ ...

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండిలా...!

తెల్లవెంట్రుకలు… ఈ మాట వింటే చాలు చాల మంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కొన్ని వేల వెంట్రుకల్లో ...

పాలతో ఉప్పు... పాలు తాగి పనసపండు తింటే ఏమవుతుంది...?

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే పాలను ఎలాగంటే అలా తీసుకోరాదు. చాలామంది ఉదయం వేళ పాలు, ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine