రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » రత్నాల శాస్త్రం » మూల నక్షత్రము నాలుగో పాదములో పుట్టినవారైతే..! (Moola nakshatra | Religion | Astrology | Panchang | Gemology)
రత్నాల శాస్త్రం
Bookmark and Share Feedback Print
 
FILE
మూలనక్షత్రము నాలుగో పాదములో పుట్టిన జాతకులు పుట్టిన రెండు సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు శుక్ర మహర్ధశ కావడంతో వజ్రమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

22-28వ సంవత్సరం వరకు ఈ జాతకులకు రవి మహర్ధశ కావడంతో కెంపును వెండితో ఉంగరపు వేలుకు ధరించగలరు. 28-38సంవత్సరాల వరకు మూల నక్షత్రము, నాలుగో పాదములో పుట్టిన జాతకులకు చంద్ర మహర్ధశ కావడంతో వెండితో పొదిగించిన ముత్యమును ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే 38-45 సంవత్సరముల వరకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు. ఇంకా 45-63 సంవత్సరములు వరకు రాహు మహర్ధశ కావడంతో గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం.

ఇకపోతే.. 63-79 సంవత్సరాల వరకు ఈ జాతకులకు గురు మహర్ధశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఇకపోతే మూల నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులకు బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. ఆదివారం, సోమ, మంగళస గురు, శనివారాలు వీరికి అనుకూలించవు. రంగుల విషయానికొస్తే.. నలుపు, తెలుపు, నీలము, పచ్చ రంగులు వీరికి శుభఫలితాలనిస్తాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మూల నక్షత్రం, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, పంచాంగం, రత్నాల శాస్త్రం