దృశ్యరూపంలో శ్రీ సర్వధారి నామ సంవత్సర రాశి ఫలాలు....
WD Photo
WD
సర్వధారినామ సంవత్సరంలో మీ యోగక్షేమాలను పరామర్శిస్తూ జరిగే పంచాంగ శ్రవణం సందర్భాన్ని పునస్కరించుకుని తెలుగు వెబ్‌దునియా వీడియో కవరేజిని మీకు అందిస్తోంది. తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా 12 రాశుల వారీగా ఏ రాశి వారికి ఏయే ప్రయోజనాలు కలుగనున్నాయో వివరిస్తూ విడివిడిగా పంచాంగకర్త శ్రీ రామన్ అందించిన రాశిఫలాల విశేషాలను వీడియో రూపంలో వెబ్‌దునియా తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
ఈ ఉగాది ఆరంభం నుండి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ తమ తమ రాశులకు అనుగుణంగా సంవత్సరం పొడవునా కలిగే మేలు కీడులను మీరు పాఠం రూపంలో కాకుండా వీడియోలోనే వీక్షించవచ్చు. విడివిడిగా 12 రాశుల వారి రాశి ఫలాలను వెబ్‌దునియా తెలుగు సమర్పిస్తున్న వీడియో ఫైళ్ళలో నేరుగా వీక్షించి ఉగాది ఫలాలను దృశ్యరూపంలో ఆస్వాదించగలరు.
సర్వధారి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలకు మేం సమర్పిస్తున్న ఈ వీడియో రూపంలోని రాశి ఫలాలను విని, చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను పంపగలరు. తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా వీక్షకులకు శుభాకాంక్షలు.