శని త్రయోదశి ఈ నెల 17వ తేదీ, సెప్టెంబరు 13, 27వ తేదీలు, వచ్చే జనవరి 24వ తేదీ నాడు వస్తుంది కావున ప్రతివారు శనికి తైలాభిషేకం చేయించిన చాలా మంచిది. అలాగే అతిముఖ్యంగా వృషభ, కర్కాటక, సింహ, కన్య, మకర రాశుల వారు ఈ శని దోషం ఉన్నందువల్ల శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది. ప్రతి మానవుడు, ప్రతి జీవి శని ప్రభావానికి లోనవ్వనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. శనికి ఇష్టమైన రోజు శనివారం, అలాగే తిథి త్రయోదశి కలిసినందున శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు. | | శని త్రయోదశి ఈ నెల 17వ తేదీ, సెప్టెంబరు 13, 27వ తేదీలు, వచ్చే జనవరి 24వ తేదీ నాడు వస్తుంది కావున ప్రతివారు శనికి తైలాభిషేకం చేయించిన చాలా మంచిది |
| |
నవగ్రహాల్లో చంద్రునికి అతి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనస్సుకి చంద్రుడు కారకుడు అవటంవల్ల ఈ చంద్రుడికి శని ప్రభావం ఏర్పడినపుడు అనేక రూపాలలో మానసిక ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. ఈ శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. ఉదాహరణకు వర్తమానం శని సింహరాశిలో సంచరించటంవల్ల కర్కాటక, సింహ, కన్య రాశులను శని దోషం ఏర్పడినది. శని ఉన్న రాశికి వెనకరాశి ముందురాశికి ఏలినాటి శని దోషం అంటారు. చంద్రుడున్న రాశి నుంచి నాల్గవ స్థానంలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని దోషం అని చంద్రుడున్న రాశి నుంచి ఎనిమిదవ స్థానం శని ఉన్నచో అష్టమ శని అని అంటారు.
అర్ధాష్టమ శని వర్తమానం వృషభ రాశికి నాల్గవ స్థానంలో శని సంచరించటంవల్ల ఈ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఏర్పడినది. ఈ శని దోషం వల్ల ఏకాగ్రత లోపం, వాహన ప్రమాదాలు, పెద్దల గురించి ఆందోళన, చంచలత్వం అధికం కావటం, ఆరోగ్యంలో చికాకులు వంటివి ఏర్పడతాయి. ఏలినాటి శని దోషం అనగా శని సంచరిస్తున్న స్థానానికి వెనక భాగం అనగా పన్నెండవ స్థానం తాను ఉన్నస్థానం, రెండవ స్థానాన్ని ఏలినాటి శని దోషం అంటారు.
|