వర్తమానం సింహరాశిలో శని సంచారం జరుగుతున్నందువల్ల కర్కాటక రాశికి, సింహ రాశికి, కన్యా రాశికి ఏలినాటి శని దోషం జరుగుతోంది. కర్కాటక రాశికి ద్వితీయ స్థానం నందు అనగా కుటుంబస్థానం, ధన స్థానం నందు శని సంచారం వల్ల ఊహించని ఖర్చులు, కుటుంబీకులు మధ్య విభేదాలు, కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు, విద్యార్ధులకు ఏకాగ్రత లోపం వంటివి ఈ కర్కాటక రాశి వారు ఎదుర్కొంటారు.
సింహరాశి మీద శని సంచారం వల్ల సింహరాశి వారు ఆకారంలో కొంతమార్పు జుట్టు అధికంగా ఊడటం, శరీరం బలహీనపడటం, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి, కొంత తగ్గటం అందరికీ సహాయం చేసి మాటపడటం, ఆందోళన పడటం వంటివి ఎదుర్కొంటారు. కన్యా రాశి వారికి వ్యయం స్థానంలో శని సంచారం వల్ల నిద్రాభంగం, ఎముకలకి సంబంధించిన చికాకులు, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి కొంత తగ్గటం, ఉన్నట్టుండి ఉద్రేక పడటం, వ్యాపారస్తులకు ఆందోళన కలగటం, నిలకడ లేకపోవటం వంటివి ఎదుర్కొంటారు.
తదుపరి అష్టమ శని... ఈ అష్టమ శని మకరరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల అష్టమ శని ఏర్పడినది. ఈ అష్టమ శని దోషం వల్ల మానసిక ఆందోళన పెరగటం, చిన్న చిన్న ప్రమాదాలు, తలపెట్టిన పనులు వాయిదా వేయటం, మాటపడటం, కుటంబీకుల మధ్య చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఈ దోషాలన్నింటికీ శని కారకుడు అయినందువల్ల శనివారం, త్రయోదశి కలిసినది శని త్రయోదశి. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. శనికి ఇష్టమైన రోజు ఈ శని త్రయోదశి. ఈ శని త్రయోదశి నాడు నువ్వుల నూనె, నలుపు వస్త్రం, నల్ల నువ్వులు, బెల్లం, నీలిరంగు వర్ణం కలిగిన పుష్పాలతో శనేశ్వరునికి అర్చించినట్లైతే ఈ శని దోషం తొలగిపోయి శుభం చేకూరుతుంది.
మానసిక అశాంతి తొలగిపోవటానికి, ఆరోగ్యం చేకూరటానికి, అన్నివిధాలా కలిసివచ్చేందుకు ఈ శనేశ్వరునికి తైలాభిషేకం చేయించినట్లైతే శుభం కలుగుగలదు. |