ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > పంచాంగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శనిగ్రహ మహిళా జాతకుల లక్షణాలు  Search similar articles
WD
శనిగ్రహాధిపత్యంలో జన్మించిన మహిళా జాతకులు సమాజంలో గౌరవ స్థానాన్ని అలంకరిస్తారని జ్యోతిష్కులు అంటున్నారు. అదేవిధంగా శనీశ్వరుని ఆధిపత్యంలో కొన్ని సమస్యలు తటస్థించినా, సుఖసంతోషాలను అనుభవిస్తారని వారు పేర్కొంటున్నారు. ఇకపోతే శని ఆరో పాదంలో ఉండటం వల్ల వీరు శత్రువులను జయించి విజయాన్ని పొందుతారు.

మంచి దుస్తులు ధరించి సమాజంలో గౌరవంగా జీవిస్తారు. శని నాలుగో పాదంలో ఉండటం వల్ల వాహనాలతో సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలకు ఆటంకం కలిగించే పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒక వేళ పిల్లలు పుట్టినా ఆడపిల్లలే పుడుతారు. ఇతరులు చెప్పే మంచి మాటలను వీరు పెడచెవిన పెడతారు. యోగ్యమైన సంతానం కలిగి అందరి మన్ననలను పొంది, సుఖ సంతోషాలతో జీవిస్తారు.

దయాగుణం కలిగిన వీరు అనేక రకాల దానధర్మాలు అధికంగా చేస్తారు. సమాజంలో పలువురి మద్దతు, ఆదరణ వీరికి ఉంటుంది. శని రెండో పాదంలో ఉండడం వల్ల, కుటుంబంలో ఆదాయం తగ్గిన కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. మహిళలు శనిగ్రహంలో ఉన్నట్టయితే ఆరోగ్యరీత్యా కష్టాలు ఏర్పడి మనో వ్యాకులతలు ఏర్పడతాయి. ఇతరుల నుంచి అవమానాలు ఎదురవుతాయి. ముందుగా ఊహించిన అవకాశాలు చేజారిపోతాయి. ఎపుడు చూసినా పరుష కఠిన మాటలతో మనస్సు కష్టపడే విధంగా మాట్లాడుతారు.

శని మూడో గ్రహంలో ఉండటం వల్ల ఆదాయం అన్ని వైపుల నుంచి రావడంతో వీరు ఆప్యాయంగా ఉంటారు. శని ఐదో స్థానంలో ఉండటం వల్ల పుత్రపాప్తిలో ఫలం తగ్గి, సంతానం కలగటంలో కష్టాలు ఎదురవుతాయి. ఉపయోగం లేని పనులను చేసి వృధా ఖర్చులు చేస్తారు. వీరికి ఆయుష్షు అధికంగా ఉంటుంది. దీనివల్ల వేరుబాటును కూడా ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల పక్షం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరిన్ని
ఆరోగ్యంపై గ్రహాల ప్రభావం
వెబ్‌దునియాలో పంచాంగం
వెబ్‌దునియాలో పంచాంగం
వెబ్‌దునియాలో పంచాంగం
వెబ్‌దునియాలో పంచాంగం
వెబ్‌దునియాలో పంచాంగం