ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > పంచాంగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మిథున లగ్నంలో పుట్టారా? బాధ్యతలు తప్పవు  Search similar articles
WD
మిథున లగ్నంలో జన్మించిన వారికి చిన్ననాటి నుండే బాధ్యతల మోత తప్పదని జ్యోతిష్కులు అంటున్నారు. చిన్నపాటి కుటుంబ వాతావరణంలో జన్మించినా వారికి సామర్థ్యతలో ఎలాంటి లోటు ఉండదు. తల్లివద్ద ఎలాంటి సందర్భాల్లోనైనా ప్రేమపూరితంగా ఉంటారు. తండ్రి వద్ద మాత్రం కొంత పరిమితాన్ని పాటిస్తారు.

పట్టుదల గుణాన్ని కలిగి ఉండుట చేత సోదరుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. వీరికి మంచి భాగ్యవవంతురాలైన భార్య లభిస్తుంది. వసతుల అన్ని సమకూరుతాయి. వివాహానంతరం సుఖమైన జీవితాన్ని గడుపుతారు. భార్య ఆస్తిని ఆశించే విధమైన మనస్తత్వ ధోరణి వీరికి ఉంటుంది.

సంతాన ప్రాప్తిలో కాస్త ఆలస్యం కావచ్చు. కష్టపడటానికి ఇష్టపడని విధంగా సోమరితనం గుణంతో కూడిన భార్య అమరుతుంది. ఇకపోతే మిథున లగ్నంలో జన్మించిన వారు ఎలాంటి వృత్తిలో స్థిరంగా ఉండరు. ఉద్యోగనిమిత్తం పలుదేశాలకు ప్రయాణంకోసం వెళ్తారు. అకౌంట్స్, సూపర్‌వైజర్ వంటి వృత్తుల్లో రాణిస్తారు. వ్యవసాయంలో మంచి రాణింపు ఉంటుంది.

రాజకీయం, విద్య, వైద్యం వంటి తదితర రంగాల్లో కూడా వీరికి మంచి పలుకుబడియుంటుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారికి మంచి ఆదాయాలు లభించవచ్చును. కొన్ని పరిస్థితుల్లో ఆర్థిక సమస్యల కారణంగా అప్పులు పడే అవకాశం ఉంది. అప్పు చేసైనా తలపెట్టిన కార్యాలను పూర్తిచేయాలనే తలంపు కలిగియుంటారు. ఆడంబర జీవితానికి ఇష్టపడతారు. గృహం సొంతంగా ఉండాలని యాజమాన్యతను ఎల్లప్పుజడు శ్వాసిస్తూ ఉంటారు.

మహిళలు- ఆడంబర జీవితానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా ఉండటం వీరి స్వభావం. అంతేగాకుండా మంచి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. నిర్వాహ బాధ్యత వహించటంలో నిపుణులు. ఎల్లప్పుడు ఆనందంగా కన్పిస్తారు. మంచి గుణవంతురాలుగా ఉంటారు. మర్యాద, సంస్కారం వీరికి మెండు. భర్త వద్ద వినయంగా ఉంటారు. సంతానం అంటే వీరికి అధిక ప్రేమ. వారిపట్ల అధిక ప్రేమపూరితంగా వ్యవహరిస్తారు.

కుటుంబవ్యవహారంలో సంక్షేమాన్ని గుర్తుంచుకుని బాధ్యత వహిస్తారు. కుటుంబవ్యవహారంలో తమకే ఆధిక్యత వహించాలని భావిస్తారు. వీరికి ఇతరుల పొగడ్తలంటే మక్కువ ఎక్కువ. ఇతరుల కష్టాన్ని చేతులు తట్టి ఆనందించేవారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జాతకులకు కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం సక్రమం ఉండదు. వ్యాధులు వీరికి చెంతనుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్తత్త వహించాలి.
మరిన్ని
వెబ్‌దునియాలో పంచాంగం
శనిగ్రహ మహిళా జాతకుల లక్షణాలు
ఆరోగ్యంపై గ్రహాల ప్రభావం
వెబ్‌దునియాలో పంచాంగం
వెబ్‌దునియాలో పంచాంగం
వెబ్‌దునియాలో పంచాంగం