ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > పంచాంగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మేషలగ్న జాతకుల గుణగణాలు  Search similar articles
WD
మేషలగ్నంలో జన్మించిన వారు చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల పర్యవేక్షణలో గానీ, వారి సమక్షంలో పెరిగే అవకాశాన్ని కలిగి ఉండరు. తల్లిదండ్రులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సోదరుల బలం అధికంగా ఉంటుంది. తల్లిందండ్రుల వద్ద ప్రేమతో ఉంటారు. వీరికి అందంతో పాటు భార్య గుణవంతురాలుగా ఉంటుంది. వినయం వీరికి దోహదంగా ఉంటుంది.

సతీమణి పక్షంలోని బంధువుల సహాయం లోటుగానే ఉంటుంది. కుటుంబ అభివృద్దికి తీవ్రంగా శ్రమిస్తారు. కుటుంబంలో పలు సమస్యలు ఏర్పడటానికి కారణాలు ఉద్భవిస్తాయి. వాటిని సామర్థ్యవంతంగా పరిష్కరిస్తారు. భార్య, సంతానం మీ మాటలను వినయంతో పాటిస్తారు. అయితే వారిని కొన్ని సందర్భాలలో తృప్తి పరచటం కష్టతరం.

జీవితంలో గొప్ప స్థానంలో ఉండాలనే ఉబలాటం ఉంటుంది. అయితే ఎలాంటి అభివృధ్ది లభించటం సాధ్యం కాదు. కష్టపడి శ్రమించటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. కళలంటే ఆసక్తి మెండు. పోలీసుశాఖ, సైన్యం, అగ్నిమాపక దళం వంటి శాఖల్లో రాణిస్తారు. ధైర్యం, మొండితనం ఎక్కువ. ప్రతి కార్యాన్ని సామర్థ్య వంతంగా నిర్వహిస్తారు. వైద్యంలో మంచి పదవులను అలంకరిస్తారు.

జర్నలిస్టులు అయ్యే అవకాశాలున్నాయి. వృత్తి పరమైన వాటిలోనూ మంచి అభివృధ్ది ఉంటుంది. వ్యవసాయం, హోటల్ నిర్వాహం వీరికి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. కళలకు చెందిన శాఖల్లో అవకాశాలు లభించినా, ఆర్థిక శాఖలో మాత్రం కాస్త అభివృధ్ది అవకాశాలుండవు. ఇతరులకు సహాయం చేసే గుణవంతులు.

ఇతరులకు అప్పులిస్తే వాటిని తిరిగి పొందటం కష్టం. వచ్చిన ఆదాయంతో ఖర్చులు పెట్టటం రాదు. ఆడంబరమైన ఖర్చులకే ప్రాధాన్యతనిస్తారు. ఖర్చులు అధికంగా ఉండటంతో కాస్త ఇక్కట్లకు గురయ్యే పరిస్థితులు నెలకొంటాయి.

మహిళలు- మంచి గుణం, అందంతో ఉంటారు. వంట చేయటంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. ప్రేమతో మెలగటం వీరి స్వభావం. పొగడ్తలంటే వీరికి ఇష్టం. ఆరోగ్యకరమైన సూచనలు తీసుకోవటంలో జాగ్రత్త వహించండి.
మరిన్ని
మిథున లగ్నంలో పుట్టారా? బాధ్యతలు తప్పవు
వెబ్‌దునియాలో పంచాంగం
శనిగ్రహ మహిళా జాతకుల లక్షణాలు
ఆరోగ్యంపై గ్రహాల ప్రభావం
వెబ్‌దునియాలో పంచాంగం
వెబ్‌దునియాలో పంచాంగం