ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > పంచాంగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మకర లగ్న జాతకుల గుణగణాలు  Search similar articles
WD
మకర లగ్నంలో జన్మించిన వారు దేహబలంతో, ధైర్యవంతులై ధృడమనస్కులైయుంటారు. ఎలాంటి కార్యానైనా సులభంగా చేస్తారు. తీవ్రంగా శ్రమిస్తారు. ఎల్లప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు. విరామం వీరికి ఇష్టం పడని అంశం. ఇతరులు తెలిపిన అంశాన్ని అలాగే నమ్మకుండా ఆ విషయాన్నిఅనేక సార్లు ఆలోచించి కార్యాచరణ చేస్తారు.

ఇతరుల వద్ద ప్రతి సందర్భాల్లోనూ హెచ్చరికతో నడుచుకుంటారు. ఇతరుల్ని సామాన్యంగా నమ్మని స్వభావం వీరిది. ఆత్మవిశ్వాసం కొంత తక్కువగా కలిగియుంటారు. ఏదేని ఒక కార్యాన్నిస్వీకరించినప్పుడు పూర్తి నిమగ్నంతో పనిని పూర్తిచేసే వరకు నిద్రపోరు. తాను చేస్తున్న కార్యంలో ఎలాంటి సమస్యలు తమకు ఎదురుకాకూడదనే మనసత్త్వంతో పనిచేస్తారు.

అంతేగాక స్వార్థపరత వీరి కార్యాలలో గోచరమవుతుంది. తమకు సమస్యను కలిగించే కార్యాన్ని చేపట్టడానికి సంకోచిస్తారు. పట్టుదలతో తాము అనుకున్న కార్యాన్ని సాధించే వరకు కృషి చేస్తారు. తాము నిర్ణయించిన నిర్ణయాన్ని మార్చుకోవటంలో ఆసక్తి చూపరు. ఈ స్వభావంతో నిజమైన వివరాలకు అర్థం లేకుండా పోవటానికి ఆస్కారాలున్నాయి.

ఇతరులను అధికారం చేయనివ్వరు. తామే అధికారం చెలాయిస్తారు. సాధారణంగా సాత్త్వికులుగా దర్శనమిస్తారు. ఎటువంటి వాగ్వివాదాల జోలికి వెళ్లరు. అయితే ఇతరులకు తమ జోలికి వస్తే మాత్రం వారితో పోరాడి జయించే వరకు ఊరుకోరు. చిన్నవిషయాన్ని కూడా పెద్దదిగా జోడించి చెప్పటంలో నిపుణులు. తమను తామే గొప్పగా చెప్పుకునే స్వభావాన్ని కలిగియుంటారు.

చిన్నచిన్న కష్టాలు సంభవిస్తే వాటిని పెద్దఎత్తుగా తీసుకొని బాధపడుతుంటారు. ఇతరులను పొగడటం వీరికి నచ్చదు. ఇతరులు చేసే చిన్నతప్పును పట్టుపట్టి విమర్శించే ధోరణిని కలిగియుంటారు. దీనివలన ఇతరుల కోపతాపాలకు గురవుతారు. అన్నీ విషయాల్లో జ్ఞానం ఉన్నా... స్వార్థంతో మెలగటం ద్వారా వీరికి అపవాదాలు ఏర్పడుతాయి.

చెడు మార్గాలలో పయనించే స్వభావులు కూడా. అయితే తమ వాక్చాతుర్యతతో ఇతరులను సులభంగా ఆకట్టుకునే నిపుణత వీరికి ఉంటుంది. తమకు ఆసక్తి లేని విషయంలో జోక్యం చేసుకోరు. ఆపదలోనున్న వారిని ఆదుకుంటారు. దైవభక్తితో ఉంటారు. ఆడంబర జీవితాన్ని జీవించటానికి ఆశపడుతారు. ఆభరణాలు, వాహనాలు వంటి విలువైన వాటిపై మక్కువ చూపుతారు.
మరిన్ని
కేతు దశా భుక్తి ఫలాలు
కుజ, పుత్రదోషాలు- పరిహారాలు
మిథున లగ్నకారుల కుజ, బుధ గ్రహాల ఫలాలు
వృషభ లగ్న జన్మకారుల గుణాధిశ్యాలు
వెబ్‌దునియాలో పంచాంగం
చంద్రుని ఆకార వర్ణన.. శాంతి మార్గాలు