ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > పంచాంగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నవగ్రహ కారక దేవతలు  Search similar articles
FILE
పన్నెండు స్థానాలకు అధికారం ఉన్నట్టే నవగ్రహాలకు కూడ అధికారాలున్నాయి. అంతేగాక గ్రహాలకు అధికారయుక్తమైన దేవతలున్నారు. ముఖ్యంగా ప్రతి గ్రహం కొన్నింటికి కారకులుగా వ్యవహరిస్తున్నాయి. అందులో తొమ్మిది గ్రహాల్లో ప్రతి గ్రహానికి ప్రత్యేకత ఉంది.

సూర్యుడు: ఆత్మ, శిరస్సు, వైద్యం ప్రతాపం, ధైర్యం, రాజసేవ, తపస్సు, ఉద్యోగం, గోధుమలు, మిరియాలు, యాత్ర, ధ్వని వంటి వాటికి కారకుడు.

చంద్రుడు: మాత, పరాశక్తి, వస్త్రం, సుఖభోజనం, శరీరం, నిద్ర, శీతం వ్యాధులు, గాయాలు, రుణాల బాకీలు, వెన్న, బియ్యం, వెండి, సమరం, కీర్తి వంటి వాటికి చంద్రుడు కారకుడు.

కుజుడు: సోదరత్త్వం, భూమి, అగ్ని, యుధ్దం, గాయాలు, ద్వేషం, వ్యయం, ఉత్సాహం, పగడం వంటి వాటికి కారకునిగా కుజున్ని వ్యవహరిస్తారు.

బుధుడు: విద్య, జ్ఞానం, దానాధిపతి, రథాసీనుడు, వాక్చాతుర్యం, ఉపాసన, కథాకావ్యాలు, వృత్తి, నాట్యం, వాత వ్యాధులు, ఆకులు, ధాన్యాలు, మెంతులు వంటి వాటికి బుధుడు కారకుడు.

గురు: సంతానం, అష్టమాసిద్ది, ఉపదేశం, బుధ్ది, రాజ్యాధిపత్యం, శృతి శాంతం, స్వర్ణం, వైఢూర్యం, పుష్పరాగం, పుష్పం, నేత్రాలు వంటి వాటికి గురువు కారకుడు.

శుక్రుడు: కళత్రం, కీర్తి, సంగీతం, వాద్యం, భరత నాట్యం, సుగంధ ద్రవ్యాలు, రూపవంతం, యవ్వనం, రత్నం ,వ్యాపారం, లోహాలు వంటి వాటకి శుక్రుడు కారకుడు.

శని: ఆయుష్మంతం, జీవనం, సేవకం, నీల రత్నం, జైలు జీవనం, చిత్తభ్రమ, రుణం, అంకవికలాంగం, ఆవాలు, నూనె వంటి వాటికి శనీశ్వరుడు కారకుడు. అంతేగాకుండా ఇతని కాలంలో వివిధ సమస్యలు తలెత్తుతాయి.

రాహు: ఆయుషు, యోగం, ప్రతాపం, వృత్తుల అవకాశాలు, జలఖండనం, పిత్తం, అంగవిహీనం, గాయాలు వెంటి కారకుడు రాహువే.

కేతు: జ్ఞానం, కపటమైన వృత్తులు, విదేశీ జీవనం వంటి వాటికి కేతువే కారకుడు.
మరిన్ని
వెబ్‌దునియాలో పంచాంగం
మకర లగ్న జాతకుల గుణగణాలు
కేతు దశా భుక్తి ఫలాలు
కుజ, పుత్రదోషాలు- పరిహారాలు
మిథున లగ్నకారుల కుజ, బుధ గ్రహాల ఫలాలు
వృషభ లగ్న జన్మకారుల గుణాధిశ్యాలు