సింహ రాశిలో జన్మించిన వారు ఎల్లప్పుడు చురుకుదనంతో దర్శనమిస్తారు. ఇతర రాశులకు చెందిన వారి కంటే సామర్థ్య వంతులుగా ఉంటారు. తాము అనుకున్న కార్యాన్ని ముగించే వరకు ఎటువంటి కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేస్తారు.
ఇతరులకు సహాయపడటం దయ, ప్రేమతో ఇతరుల వద్ద నడుచుకోవటం వీరి స్వభావం. ఇతరులు తన్ను అర్థం చేసుకుని పొగిడే పొగడ్తలను ఆశిస్తారు. అదే పక్షంలో అధిక పొగడ్తలకు తావివ్వరు. సామాజిక సేవలో ఆసక్తిగా చూపిస్తారు. అన్నీ కార్యాలను ఒంటిరిగా సాధించి శిఖరాన్ని అందుకోవాలనుకుంటారు. కార్యాచరణకు తగిన శక్తి సామర్థ్యాలను కలిగియుంటారు.
జీవితాన్నిలక్ష్యవంతంగానే కొనసాగిస్తారు. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ జరపటంతో ఎలాంటి కార్యాన్ని సులభంగా ముగిస్తారు. వీరు ఉద్దేశించి జరిపే ప్రతీ కార్యం పరులకు ఉపయోగకరంగా ఉంటుంది. అధికారయుక్తంగా ఆధిక్యతను వహించి ఇతరులకు జీవిత మార్గాలను ఉపదేశం చేస్తారు. బంధువులకు, స్నేహితులకు సన్నిహితంగా ఉంటారు.
వారికి అన్నీ కోణాల్లో సహాయాలను, ఉపాయాలను అందిస్తారు. వేదాంత సారాంశాలపై మిక్కిలి మక్కువను కలిగియుంటారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తారు. అంతేగాకుండా ఇతరులను అదే త్రోవలో నడిపించటానికి ప్రయత్నిస్తారు. కారణం లేని వివాదాలకు కోపపడటం వీరి స్వభావం. ప్రయాణాలంటే ఆసక్తి. శ్రమించి పనిచేయటం ద్వారా మంచి సుఖభోగాలను అనుభవిస్తారు.
వృత్తులును తామే స్వయంగా ప్రారంభించి అందులో విజయాన్ని సాధిస్తారు. నాటకాలు, రచయితలు, సంగీత విద్వాంసులు వంటి ఉన్నత పదలవులను అలంకరిస్తారు. తాను చేసే కార్యమే సరియైనదని వాదించే నిపుణులు.
ఉష్ణానికి సంబంధించిన వ్యాధులు ఈ జాతకులను అప్పుడప్పుడు ఇక్కట్లకు గురిచేస్తాయి. ఈ రాశిలో జన్మించిన మహిళలు సూర్యుని వలె ప్రకాశవంతంగా జీవితంలో ఎటువంటి కార్యాన్నైనా సులభంగా సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత అధికారలు ఆదరణతో పాటు వారి మన్ననలను పొంది ఉన్నత పదవులను అలంకరిస్తారు.
|