ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > పంచాంగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళా ఫలాలు  Search similar articles
FILE
చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు శాంతపరంగా ఉంటారు. అందంతో ఉండే వీరు మనస్సులో ఎల్లప్పుడు కలతతోనే సంచరిస్తారు. భాగస్వామి విషయంలో సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు నెలకొంటాయి. ఈ కారణం చేత కుటుంబంలో కొన్ని సమస్యలు పెరగటానికి ఆధారమవుతాయి.

ఈ నక్షత్రానికి చెందిన మహిళలు ఎక్కువగా కోపపడటం ద్వారా స్నేహితుల వద్ద నడుచుకోవటం వంటివి చేస్తారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ప్రశ్నించుటకు వెనుకాడరు. దీంతో పాటు జీవితంలోని మధ్య వయస్సు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. అంతకుపైగా మితమైన భోగాలు మాత్రమే వీరికి చెందుతాయి.

చిత్త నక్షత్రం మొదటి పాద ఫలాలు:
సన్నని శరీరంతో దర్శనమిచ్చే వీరు వ్యాధుల బారినపడి కొన్ని సమస్యలకు గురవుతారు. కొన్ని సమస్యల వలన మనస్సు కలత చెందటం వంటివి తటస్థిస్తాయి. సుమారైన ఐశ్వర్యంగల కుటుంబం నుంచి కళత్ర స్థానం చేకూరుతుంది. దూరప్రయాణాలు చేయటం వంటి వాటిలో ఆసక్తిని కలిగియుంటారు. జీవితంలో ఆనందదాయకత లేని జీవితాన్ని గడుపుతారు.

రెండవ పాదం:
చిత్త నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన స్త్రీలు అందంగా ఉండటంతో పాటు భయస్వభావతను కలిగియుంటారు.
ఎక్కడికి వెళ్లినా మరొకరి సహాయాన్ని ఆశిస్తారు. భాగస్వాముల చేత కొద్దిపాటి సంతోషాన్ని అనుభవిస్తారు. అధిక యోగాలకు పరిమితం కాకపోయిన మితమైన భోగాలను అనుభవిస్తారు.

మూడో పాదం:
అందంతో పాటు విద్యారంగంలో ముఖ్యస్థానాన్ని వహిస్తారు. సామర్థ్యత అధికంగా కలిగియుంటారు. వీరికి స్నేహితుల వలయం అధికంగా ఉంటుంది. అందరిని తమ వాక్చాతుర్యతతో ఆకర్షిస్తారు. నిజాయితీకి ప్రాముఖ్యతనిస్తారు. గౌరవంగా జీవించాలని ఆశిస్తారు.

నాల్గో పాదం:
బుద్ది కుశలతతో వ్యవహరిస్తారు. భవిష్యత్తును గురించి ప్రణాళికతో జీవిస్తారు. విరోధులకు దగ్గరై వారి తప్పు, ఒప్పులను గురించి ఎత్తిచూపి వారిని మంచి మార్గంలో నడిపించటానికి కృషిచేసి విజయం సాధిస్తారు. ఇతరుల వద్ద కీర్తీ ప్రతిష్టలను సంపాదిస్తారు. సుఖమైన భోగాలను అనుభవిస్తారు. జీవితంలో ఎలాంటి సమస్యలు వీరి దరికి చేరవు.
మరిన్ని
సింహరాశిలో జన్మించివ వారి ఫలాలు
వెబ్‌దునియాలో పంచాంగం
గ్రహ దృష్టి ఫలాలు, యోగాలు.
రాజయోగాలను ప్రసాదించే గ్రహాల ఆధిపత్యం
నవగ్రహ కారక దేవతలు
వెబ్‌దునియాలో పంచాంగం