ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > పంచాంగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్త్రీ జాతకుల్లో సూర్య గ్రహాధిపత్య ఫలాలు  Search similar articles
FILE
స్త్రీల జాతకాల్లో సూర్యుడు ఆధిపత్యం వహిస్తే ప్రకాశవంతమైన తేజస్సు లభిస్తుంది. తండ్రి మార్గంలో ఆస్తులు చేకూరుతాయి. అంతేగాకుండా ఐశ్వర్య వంతంతో జీవిస్తారు. మొదటి స్థానంలో సూర్యుడుంటే ఉష్ణానికి సంబంధించిన వ్యాధులకు గురవుతారు. సూర్యుడు రెండో స్థానంలో ఆధిపత్యం వహిస్తే సోదరుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

ఎల్లవేళలా సంతోషంగా జీవిస్తారు. కుటుంబంలో ఆనందం చోటు చేసుకుంటుంది. అయితే కూడా ఇతరుల ద్వేషానికి గురవుతారు. స్నేహితుల సంఖ్య తక్కువగా ఉంటుంది. సూర్యుడు మూడో స్థానంలో ఉంటే సోదరుల వలన ఆదరణ లభిస్తుంది. ఎలాంటి క్లిష్ట తరమైన కార్యాన్ని సులభంగా పూర్తి చేస్తారు. నాల్గో స్థానంలో ఆధిపత్యం వహిస్తే వాహనాలను కొనుగోలు చేస్తారు.

అంతేగాక గృహనిర్మాణం వంటివి చేస్తారు. వ్యాధులు ఈ కాలంలో కొంత శ్రమను కలిగిస్తాయి. అందుచేత హెచ్చరికతో ఉండటం మంచిది. ఐదో స్థానంలో సూర్యుడుంటే పుత్ర పాపం వలన ఏర్పడే సమస్యలు తక్కువగా ఉంటాయి. పుత్రుని చేత కలిగే సమస్యలు తొలగిపోవటం ద్వారా కుమారులు తల్లి దండ్రులకు సహాయంగా ఉంటారు.

ఆరో స్థానంలో ఉంటే విరోధుల చేత కీడు కలగటానికి ఆస్కారాలున్నాయి. ఆరోగ్య సంక్షేమంలో జాగ్రత్త వహించటం మంచిది. సూర్యుడు ఏడో స్థానంలో ఉంటే వివాహం వంటి శుభకార్యాలు జరుగుతాయి. భాగస్వాములతో కొత్త సమస్యలు ఏర్పడతాయి. అంతేగాక ఎలాంటి సమస్యలు సంభవించని కుటుంబంలోనూ సమస్యలు చోటుచేసుకోవటం జరుగుతుంది.

సూర్యుడు ఎనిమిదో స్థానంలో ఉంటే ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సియుంటుంది. దారిద్ర్య కారణంగా కొన్నిసమస్యలను ఎదురవుతాయి. సూర్యగ్రహం స్త్రీ జాతకులకు తొమ్మిదో స్థానంలో ఉంటే తండ్రి మార్గంలో ఆదరణ లభించటంతో పాటు సహాయత కూడా లభిస్తుంది. కోపం వలన అధిక సమస్యలు నెలకొంటాయి.

పదో స్థానంలో ఉంటే శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నత లభిస్తుంది. పదకొండో స్థానంలో ఆధిపత్యం వహిస్తే ఆభరణాలు, నూతన వస్తువులను కొనటం వంటివి చేస్తారు. బంధువులు, స్నేహితులు వీరికి అన్నీ విధాల అనుకూలంగా ఉంటారు. పన్నెండో స్థానంలో ఆధిపత్యం వహిస్తే ధనవ్యయం, కీడును కలిగించే కార్యాలు జరగుతాయి. పట్టుదల కారణంగా ఇతరుల ద్వేషానికి కారణమవుతారు.
మరిన్ని
చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళా ఫలాలు
సింహరాశిలో జన్మించివ వారి ఫలాలు
వెబ్‌దునియాలో పంచాంగం
గ్రహ దృష్టి ఫలాలు, యోగాలు.
రాజయోగాలను ప్రసాదించే గ్రహాల ఆధిపత్యం
నవగ్రహ కారక దేవతలు