రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » ఏలినాటి శని- నవగ్రహ దోష నివారణ
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
తమ కోర్కెలు నెరవేరాలని భక్తులు వివిధ దేవాలయాలకు వెళ్లి నవగ్రహ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే.. కొంతమందికి ఏలినాటి శని, నవగ్రహ దోషాలు ఉంటాయి. ఈ దోష నివారణకు కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే పోతాయని ధర్మశాస్త్రాలు, జోతిష్యం చెపుతోంది. ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు చేయాల్సిన విధి విధానాలు పరిశీలిద్దాం. ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయట. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినచో కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చు.

గురుబోధలను భక్తితో అనుసరించాలి. శ్రేయదాయకమైన కథా శ్రవణము పాటించాలి. జపములను నిష్టతో చేసి, దానధర్మములను త్రికరణ శుద్ధిగా నిర్వహించినచో కొంత మేరకు గ్రహ దోషం నివారించవచ్చు. అంతేకాకుండా ఓ వ్యక్తి చేసిన పుర్వజన్మమున చేసిన పాపమును గాని, పుణ్యమును ఈ జన్మమున ఫలమునుల ఇచ్చును. పూర్వజన్మ పుణ్య విశేషముచే అదృష్టము లభ్యమైనట్లే. పూరాకృత పాపము ఈ జన్మమున వ్యాధి పీడించును.

వీటిని తొలగించుకునేందుకు ఔషధ సేవనము, దానధర్మములు చేయుట, జప హోమాదుల నిర్వహించుట వంటి వాటివలన శాంతి సిద్ధించునని శాస్త్రాలు చెపుతున్నాయి. పాంచభౌతికమగు శరీరము బుద్ధుడు ప్రాయము కావున బ్రాహ్మణునకు ఏది సమర్పించినను దోషము పోవును. అలాగే మనోదత్తము, ధారాదత్తము, వాగ్ధాత్తమును గాని దానము చేయవలెను. అలా చేసినచో సకల సౌఖ్యములు సమకూరునని శాస్త్రములు చెపుతున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణుని ఇవ్వాల్సిన దాన ధర్మములను విధిగా ఇవ్వాలి.

అలాగే ఏలినాటి శని దోశనివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లనిపత్రములతో పూజించి నల్లని బ్రాహ్మణునికి గానీ, పల్లని శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్యం సిద్ధాంతం చెపుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి పంచాంగం తమ కోర్కెలు భక్తులు వివిధ దేవాలయాలు నవగ్రహ దర్శనం ఏలినాటి శని దోషాలు ఏలినాటి శని నవగ్రహ దోష నివారణ