రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » శనివారం ఆచరించాల్సిన విధానాలు
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
వారంలో ఏడోరోజుగా శనివారాన్ని పరిగణిస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. యూరప్‌లో శనివారాన్ని వారంలో ఆరో రోజుగా ఆచరిస్తున్నారు. అదే విధంగా యూరప్‌లోని ఐఎస్ఓ 8601 ప్రమాణాలను పాటించే సంస్థలు కూడా శనివారాన్ని ఆరో రోజుగా పరిగణిస్తున్నాయట. ఇలాంటి శనివారంలో శుభకార్యాలను నిర్వహించకూడదని భారతీయ జోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.

ఇందులో భాగంగా శనివారం ఆచరింపదగిన విషయాలను గురించి పరిశీలిస్తే... ఈ రోజున స్త్రీలు నీలి రంగు పువ్వులైన డిసంబరాలను ధరించడం శుభమని జ్యోతిష్కులు అంటున్నారు. అదేవిధంగా ఈ దినం ముదురు నీలి రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభప్రద సూచకములు సంభవించునని వారు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే... శనివారం రోజున నువ్వులు బెల్లం కలిపి చేసే తీపి పదార్థం గానీ, నువ్వులు కలిపిన చక్కిరాలు తినడం ఆరోగ్యానికి మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణలు పేర్కొంటున్నారు. నేరేడు, రేగు పండ్లు లభ్యమయ్యే కాలంలో శనివారంనాడు వాటిని తినడం కూడా మంచిదేనని వారు అంటున్నారు.

ప్రతీరోజూ దైవ నమస్కారము చేయడం ఆనవాయితీ కావడంతో శనివారం రోజున ఈశ్వరాంజనేయ ఆలయ దర్శనం మహోన్నత భాగ్యానికి నిదర్శనమని జోతిష్కులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి పంచాంగం వారం ఏడోరోజు శనివారం యూరప్‌