రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » మేషరాశిలో జన్మించిన మహిళా జాతకుల ఫలితాలు
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
మేషరాశిలో జన్మించిన జాతకులు కార్యాచరణలో అధిక శ్రద్ధను వహిస్తారు. కుజ, చంద్ర, సూర్య గ్రహాలు ఉచ్ఛస్థానంలో ఆధిపత్యం వహించడంతో ఎలాంటి కార్యాన్నైనా పలు మార్లు ఆలోచించిన అనంతరమే ఆచరించాలి. కట్టుదిట్టాలపై అధిక నమ్మకం వహిస్తారు. మర్యాదతో ప్రవర్తిస్తారు. అయితే మాటిమాటికి కోపపడటం వీరి స్వభావం. భోజనప్రియులుగా ఉంటారు. ఇతరులు వీరి వద్ద మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఆశిస్తారు.

ధృఢధైర్యలుగా ఉంటారు. విదేశ ప్రయాణంలో అధికంగా ఆసక్తి చూపుతారు. అయితే వీరి వద్ద నిజాయితీ పరమైన అంశాలు కన్పించవు. నిలకడ లేని మనస్సు కలవారై ఉంటారు. ఇతరులను నొప్పించే విధంగా వీరి శైలి ఉంటుంది. ఆభరణాలు, నూతన వస్త్రాలు ధరించడంలో అధికంగా ఆసక్తి చూపుతారు. గృహ నిర్మాణం, వాహనాలు కొంటారు.

గురుగ్రహ ఆధిపత్యంతో అధికంగా విద్యా రంగంతో పాటు సంగీతం వంటి రంగాల్లో ఈ మహిళా జాతకులు రాణిస్తారు. ఐశ్వర్యమంతులుగా ఉంటారు. వీరి జాతక ప్రకారం శుక్ర గ్రహ ఆధిపత్యం చేత జీవితాన్ని సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. ధర్మ చింతన, సౌందర్యానికి ముఖ్యత్వం ఇవ్వడంలో అధిక శ్రద్ధ వహిస్తారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి మేషరాశి జాతకులు కార్యాచరణ అధిక శ్రద్ధ మహిళా జాతకుల ఫలితాలు