రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » జనన కాల నక్షత్ర శాంతులు, విశేషాలు
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
1. అశ్విని : మూడు నాలుగు పాదాలకు దోషం లేదు. అయినా నక్షత్రం సామాన్య దోషం అయినందువల్ల సామాన్య శాంతి శిశువు యొక్క ముఖాన్ని మంత్రాలతో నూనెలో తండ్రి చూడాలి. ఈ నక్షత్రంలో అబ్బాయి పుడితే ధనవంతుడు, శౌర్యవంతుడు, అధికమైన వినయం, బుద్ధిగలవాడుగా, సమర్థుడుగా వుంటాడు. కీర్తి, సుఖము, గొప్ప శరీరము కలిగినవాడుగా వుంటాడు. అమ్మాయి పుడితే వ్యవహారాల్లో నేర్పు కలిగినదిగా, బలవంతురాలుగా, అహంకారం కలిగినదిగా వుంటుంది.

2. భరణి : మొదటి పాదము, రెండో పాదము, నాల్గవ పాదాలలో జన్మించిన వారికి దోషము లేదు. మూడో పాదంలో పుత్ర జననమైన ఆ శిశువుకు, తండ్రికి దోషము వస్తుంది. అలాగే అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి, తల్లికి దోషము వస్తుంది. ఈ దోషము 27 రోజులుంటుంది. ఈ దోష శాంతికి మహన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపాలు, దానాలు, చేయించాలి.

ఈ నక్షత్రంలో మొదటిపాదము, రెండవ పాదము, మూడవ పాదాలలో జన్మించిన వారికి దోషము లేకపోయినా, నక్షత్ర దోషమైనందువల్ల సామాన్య శాంతి శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూడాలి. అబ్బాయి అయితే విద్యావంతుడు, ఆరోగ్యవంతుడు, బుద్ధిమంతుడు, యదార్థము మాట్లాడువాడు, దృఢమగు వ్రతం కలవాడుగా అవుతాడు. అదే అమ్మాయి అయితే మిక్కిలి సుఖపడుతుంది, హాస్యంగా మాట్లాడును, తల్లిదండ్రులను పూజించును.

3. కృత్తిక : మొదటిపాదం, రెండవపాదం, నాలుగవ పాదంలో జన్మించినట్టివారికి దోషము లేదు. మూడవ పాదంలో అబ్బాయి పుడితే ఆ శిశువుకు, తండ్రికి దోషము వుంటుంది. అలాగే అమ్మాయి అయితే ఆమెకి, ఆమె తల్లికి దోషము కలుగుతుంది. ఈ దోష శాంతికి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపాలు, దానాలు, చేయించాలి.

ఈ నక్షత్రంలో ఒకటి, రెండు, నాలుగు పాదాలలో జన్మించిన వారికి సామాన్య శాంతి, శిశువు యొక్క ముఖాన్ని మంత్రాలతో తండ్రి చూడాలి. అబ్బాయి పుడితే గంభీరంగా వుండేవాడిగా, అభిమానము కలవాడుగా అవుతాడు. అమ్మాయి పుడితే కీర్తివంతురాలు, తోజోవతి, కోపం అధికంగా కలదిగా, శ్లేష్మతత్వ శరీరం గలదిగా వుండును.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి పంచాంగం మూడు నాలుగు నక్షత్రం సామాన్య దోషం అశ్విని భరణి కృత్తిక