రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » సమయస్ఫూర్తి... మిధునరాశి యువతి సొంతం
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
మిధున రాశికి చెందిన యువతి తేజోవతి, సౌందర్యవతి, సమయస్పూర్తిని కలిగి ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే లక్షణాలతో ఇతరులను ఆకర్షించే వాక్చాతుర్యతను కలిగి ఉంటుంది. అందరి అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలదిగా ఉంటుంది. ఆమెతో సంభాషణ ఎన్నటికీ మరచిపోలేనివిగా ఉంటాయి.

విభిన్నంగా ఉండటం అనేది మిధున రాశి స్త్రీకి అత్యంత ప్రీతిపాత్రం. ప్రతి విషయాన్ని పరిశీలించి చూచిన తర్వాతే దానిని అనుసరిస్తుంది. మాటలలో నేర్పు మరియు ఊహాశక్తి ఉండటమే కాక పురోభివృద్ధి గురించి ఆలోచించే ప్రంపంచంలోని కొంతమంది వ్యక్తుల జాబితాలో ఈ రాశిలో జన్మించిన మహిళలుంటారు.

చంచల స్వభావం కలిగిన మిథునరాశి స్త్రీల మెప్పును పొందటం చాలా సులభం. అయితే ఇదే కారణంతో ఆమె దూరమయ్యే అవకాశం సైతం లేకపోలేదు. ఎప్పుడూ వ్యాకుల మనస్తత్వంతో నిండే ఉండే ఈమె తన అభిప్రాయాలను చాలా వేగవంతంగా మార్చుకుంటుంది. వీరికి కోపం తెప్పించటం చాలా తేలిక.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి పంచాంగం సౌందర్యం సమయస్ఫూర్తి మిధునరాశి యువతి సొంతం