మేషరాశికి చెందిన పురుషులు స్వేచ్ఛాప్రియులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండటంతో తలపెట్టిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అయితే ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఈ జాతకులు కష్టాలను కోరి తెచ్చుకుంటారని జ్యోతిష్కులు అంటున్నారు.
ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొనే ఈ జాతకులు తమకంటూ ఏర్పరుచుకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. సమర్థత, ధైర్యం కలిగి ఉండే ఈ జాతకులు సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. అయితే ఆవేశం, కోపం ఎక్కువగా రావడంతో కొన్ని సమయాల్లో సమస్యలు ఎదురవుతాయి.
ఇక మేషరాశికి చెందిన స్త్రీలు ఎలా ఉంటారంటే..? వీరు తమ జీవితాన్ని స్వేచ్చగా గడపాలని భానిస్తారు. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండటంతో పాటు తనకంటూ కొన్ని నియమాలను నిర్దేశించుకుంటారు. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో ఎంతటి ఉన్నత స్థానాన్నైనా అధిరోహిస్తారు.
తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోగల శక్తి వీరి సొంతం. ఇంకా మేషరాశి స్త్రీ జాతకులకు ఆవేశం ఎక్కువ. ఆవేశపరులైతే ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడటం వీరి నైజం. ఆ సమయంలో న్యాయ, ధర్మాలను ఏమాత్రం పట్టించుకోరు.
అస్థిర ఆలోచనలు, ఓర్పు లేకపోవటం వంటి గుణాలతో ఈ జాతకులకు సన్నిహిత సంబంధాలను దూరమయ్యే ఆస్కారాలున్నాయని జ్యోతిష్కులు అంటున్నారు. అందుచేత ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదని వారు చెబుతున్నారు.