రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » మీ నక్షత్రం ఏం చెపుతోంది...? (Star | Stars 27 | the amount astrology | articles |)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
నక్షత్రాల సంఖ్య 27. ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో రెండున్నర నక్షత్రాలుగా ఉంటాయి. ఈ నక్షత్రాలు జాతకుని స్వభావాలు తెలుపుతాయంటున్నారు జ్యోతిష్యులు.

1** అశ్విని : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు సంచార స్వభావం కలవారిగా ఉంటారు. చపలత్వం ఈ జాతకుల స్వభావమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

2** భరణి : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తి కలిగినవారిగా ఉంటారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమౌతుంటారు, కాబట్టి ఎల్లప్పుడు ఇతరులపై ఆధారపడి, ఇతరుల నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తుంటారు.

3** కృత్తిక : కృత్తిక నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటుంటారు. ముఖ్యంగా వీరు అహంకార స్వభావులై ఉంటారు. ఈ జాతకులకు నిప్పు, వాహనాలు, ఆయుధాలంటే ఎక్కువగా భయపడుతుంటారని జ్యోతిష్యులు చెపుతున్నారు.

4** రోహిణి : రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ప్రశాంతవదనంతో, కళాప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నతమైన భావాలు కలిగిన వారిగా ఉంటారు.

5** మృగశిర : ఈ జాతకులు భోగలాలసులు. వీరికి అమితమైన తెలివి ఉన్నాకూడా తగిన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించరు.

6** ఆరుద్ర : ఆరుద్ర నక్షత్ర జాతకులు కోపోద్రిక్తులుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవునా, కాదా అన్నట్టు వీరి నిర్ణయాలుంటాయని, ఎవ్వరినికూడా విరు నమ్మరని జ్యోతిష్యులు అంటున్నారు.

7** పునర్వసు : ఈజాతకులు ఆదర్శవాదులుగాను, ఇతరులకు సహాయ సహకారాలందించేవారిగాను ఉంటారు. ముఖ్యంగా వీరు శాంతచిత్త స్వభావులు. ఆధ్యాత్మికం అంటే వీరికి అమితమైన ఇష్టం.

8** ఆశ్లేష : ఆశ్లేష నక్షత్ర జాతకులు మంకుపట్టు స్వభావులై ఉంటారు. వీరిలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. స్వయంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు.

9** మఖ : ఈ జాతకులు స్వాభిమానిగా ఉంటారు. గొప్ప గొప్ప కోరికలుంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలుంటాయంటున్నారు జ్యోతిష్యులు.

10** పూర్వాభాద్ర : వీరు కళలపట్ల ఎక్కువ మక్కువ చూపుతుంటారు. రతిక్రీడలంటే అమితమైన ఇష్టం ఈ జాతకులుకు.

11** ఉత్తరాభాద్ర : ఇతరులతో వీరు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారై ఉంటారు ఈ జాతకులు.

12** హస్త : హస్త నక్షత్రం జాతకులు కల్పనా జగత్తులో విహరిస్తుంటారు. వీరు శుఖ వంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు.

13** చిత్త : చిత్త నక్షత్ర జాతకులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తారు. కొత్త కొత్త ఫ్యాషన్‌లంటే అమితమైన ఇష్టం. ఎదుటివారిని ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది. ప్రధానంగా భిన్న లింగ వ్యక్తులతో ఎక్కువగా మసలుతుంటారు.

14** స్వాతి : ఈ జాతకులు అందరిని సమానంగా చూస్తుంటారు. వీరి మనసును అదుపులో ఉంచుకుంటారు. కష్టాలను ఓర్చుకునే స్వభావులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: నక్షత్రాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, రాశులు, జ్యోతిష్యులు