రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు! (Rishabha Rasi| Men| Women| Sleep| Love| Beauty| Music| Angry)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
వృషభ రాశికి చెందిన పురుషులు కార్యాచరణలో దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోరని జ్యోతిష్కులు అంటున్నారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. అందాన్నిఆరాధించే హృదయం కలిగి ఉండే వృషభరాశి జాతకులకు సంగీతం అంటే మక్కువ ఎక్కువ.

ఇతరులపై తాము పెట్టే ప్రేమకంటే అధిక స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులకు సహనం ఎక్కువ. ఈ గుణం వల్ల మంచి ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి ఇబ్బందులనైనా సునాయాసంగా ఎదుర్కొంటారు.

ఇక వృషభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే, ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, అనుకున్న పనిని సాధించే వరకూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యంపై వృషభరాశి స్త్రీలు అధిక శ్రద్ధ చూపుతారు. అతి జాగ్రత్త, ఇతరులపై ప్రేమతో మెలిగే వీరు, తన భాగస్వామి నుంచి అమితమైన ప్రేమాభిమానాలు దక్కాలని ఆశిస్తారు.

మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇంకా వృషభరాశికి చెందిన స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతుందని జ్యోతిష్కులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వృషభరాశి, పురుషులు, స్త్రీలు, నిద్ర, ప్రేమ, అందం, సంగీతం, కోపం