రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » మీరు "16వ తేదీ"న జన్మించిన వారైతే..! (16 Date| Law| Journalism| Green| White| Yellow| Pearl)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
ఏ సంవత్సరంలోనైనా.. నెలలోనైనా 16 తేది జన్మించినవారు తెలివితేటలతో న్యాయశాస్త్రంలో ప్రావీణ్యత కలిగి ఉంటారు.

జాతకరీత్యా వీరికి ముదురు రంగులు మంచివి కావు. ఆకుపచ్చ, తెలుపు, పసుపు రంగులు వీరికి మంచివి. ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

సాధారణ జీవనంలో ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా, అన్నింటిని తెలివితేటలతో జయించుకుంటూ ముందుకు సాగుతారు. విజ్ఞానశాస్త్రం, రచన, న్యాయశాస్త్రం, విద్యాబోధన, సంపాదకత్వం, లోహపరిశోధన, ఉద్యానవనాల పెంపకం వంటివాటిపై అధిక ఆసక్తి కనపరుస్తారు.

ప్రతి సంవత్సరం జూన్ 21 నుంచి జూలై 27 వరకు, అలాగే ఆగస్టు నెలాఖరు వరకు వీరికి మంచికాలమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వైఢూర్యము, ముత్య రత్నాన్ని ధరించడం ద్వారా వీరికి శుభ ఫలితాలుంటాయి. బుద్ధికుశలతతో ఏ రంగంలోనైనా దూసుకెళ్లే ఈ జాతకులు క్యాబేజీ, ద్రాక్షతో పాటు పళ్ల రసాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ప్రతి పనిలో పరిపూర్ణత కోరుకునే ఈ జాతకులు, ఎలాంటి కార్యాన్నైనా నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురికి మార్గదర్శకులుగా నిలుస్తారు. సాధారణంగా 7, 16, 25 తేదిల్లో జన్మించిన వారికి అదృష్టసంఖ్య ఏడు. అలాగే జనవరి, ఫిబ్రవరి, జూలై, ఆగస్టు నెలల్లో ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఇకపోతే.. ఆదివారం, సోమవారం వీరికి మంచి రోజులు. అలాగే 7, 16, 25, 1, 2, 4, 10, 11, 13, 19, 20, 22, 28, 29, 31 తేదిల్లో పనులు మొదలు పెడితే వీరికి శుభం కలుగుతుందని జ్యోతిష్కులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: 16వ తేదీ, ముదురు రంగులు, ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ముత్యము, వైఢూర్యం