రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » నెంబర్ ఆరా? మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే..? (Astrology| Panchang| Number6| Mariage| Affection)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
వైవాహిక అనుబంధాల దిశగా 6వ సంఖ్యను కలిగిన పురుషుడిని వివాహం చేసుకొనే వివిధ సంఖ్యల స్త్రీల దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు.

అయితే 6వ సంఖ్యకు చెందిన పురుషుడితో ప్రేమ, వైవాహిక బంధాలను ఏర్పర్చుకునే విషయంలో కాస్త జాగరూకత పాటిస్తే స్త్రీల జీవితం నందనవనంలా ఉంటుందని వారు చెబుతున్నారు.

ఇకపోతే.. 6వ సంఖ్యకు చెందిన స్త్రీ, 7వ సంఖ్యకు చెందిన పురుషుడిని వివాహం చేసుకుంటే.. తమ అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోగలగాలి. అప్పుడే వీరి మధ్య ప్రేమ సఖ్యత ఏర్పడేందుకు అవకాశాలుంటాయి. అంతేకాదు.. వీరిద్దరూ తమ భావాలను ఒకరితో ఒకరు పంచుకుని, వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండేందుకు ఇష్టపడతారు.

అదేవిధంగా 6వ సంఖ్యకు చెందిన పురుషుడు, 5వ సంఖ్యకు చెందిన స్త్రీల మధ్య ప్రేమ సంబంధాలు పటిష్టంగా ఉంటాయని, ప్రాథమిక దశలో ఒకరిపట్ల ఒకరికి విపరీతమైన ఆకర్షణ, పరస్పరం లోతైన అభిప్రాయాలను చర్చించుకోవడం చేస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఇక 6వ సంఖ్యకు చెందిన పురుషుడు, 1వ సంఖ్యకు చెందిన స్త్రీ మధ్య ప్రేమ బంధాన్ని పరిశీలిస్తే, వీరు తమ భాగస్వాములను ఎన్నుకోవడంలో తొందరపడి తప్పడు నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుచేత ఆచితూచి వ్యవహరించడం మంచిది.

6వ సంఖ్యకు చెందిన పురుషుడు, 3వ సంఖ్యకు చెందిన స్త్రీ మధ్య దీర్ఘకాలిక ప్రేమ సంబంధాలు కొనసాగేందుకు అవకాశాలున్నాయి. వీరి వైవాహిక జీవితం విజయవంతమై సుఖసంతోషాలతో జీవిస్తారు. అయితే 6వ సంఖ్యకు చెందిన పురుషులకు, 2వ సంఖ్యకు చెందిన స్త్రీలకు మధ్య ప్రేమ సఖ్యతకు అనుకూలత లేదు.

వీరి మధ్య అపార్థాలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. కానీ వివాదాలకు తావివ్వకుండా సమస్యలను పరిష్కరించేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తే వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుందని సంఖ్యాశాస్త్రం అంటోంది.

ఇంకా చెప్పాలంటే.. 6వ సంఖ్యకు చెందిన స్త్రీకి, 8వ సంఖ్యకు చెందిన పురుషునికి మధ్య ప్రేమ సఖ్యత కుదరదు. వీరి సంబంధాల్లో ప్రతిదశలోనూ భేదాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. పరస్పర ఆకర్షణ లోపిస్తుంది. వీరి వైవాహిక జీవితంలో తరచూ ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి.

అదేవిధంగా 6వ సంఖ్యకు చెందిన పురుషుడు, 4వ సంఖ్యకు చెందిన స్త్రీ మధ్య ప్రేమ సఖ్యత సాధారణ స్థాయిలో ఉంటుంది. వీరి మధ్య సత్సంబంధం నెలకొనడమనేది ఒకరిపట్ల ఒకరికున్న అంకితభావం, పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం, భవిష్యవాణి, పంచాంగం, నెంబర్, ఆరు, వివాహం, జీవితం, ఆకర్షణ